జనసేనలోకి మెగాస్టార్ ...? 'మెగా' కలయిక వెనుక రాజకీయం ఇదేనా ..?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం ! ఊహించింది ఊహించనిది జరగడమే రాజకీయం.ఇప్పుడు జనసేన పార్టీలో కూడా అదే జరగబోతున్నట్టు కనిపిస్తోంది.

రాజకీయంగా ఈ మధ్య కాలంలో పవన్ స్పీడ్ అందుకోవడంతో పాటు టీడీపీ , వైసీపీ లకు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చింది.అంతకముందు ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండబోదు అనే అంచనాల్లోనే అందరూ ఉండిపోయారు.

కానీ పవన్ తన పోరాట యాత్ర ద్వారా ప్రజల్లో అంచనాలు పెంచుకున్నాడు.ఈ దశలో అందరి చూపు జనసేన వైపు పడింది.

పక్క పార్టీల నుంచి నాయకులూ కూడా ఒక్కొక్కరూ వచ్చి చేరుతున్నారు.ఈ సమయంలోనే జనసేనలోకి మెగా స్టార్ చిరంజీవి కూడా చేరబోతున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement
Is Chiranjeevis Joining To Janasena-జనసేనలోకి మెగాస

గతామాలోనూ ఈ విధమైన పుకార్లు వినిపించినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.కానీ రాజీకీయంగా ఇప్పుడు కీలక సమయం అందులోనూ జనసేన లోకి మెగా స్టార్ ఎంట్రీ ఇస్తే వచ్చే ఊపే వేరు.

అదీ కాకుండా పవన్ - చిరు కలిస్తే అధికార పీఠం దక్కించుకోవడం ఖాయం.ఈ లెక్కలన్నీ వేసుకునే పవన్ తన అన్న చిరంజీవిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

నిన్న చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి చిరు ఇంటికి పవన్ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

Is Chiranjeevis Joining To Janasena

వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో, మెగా అభిమానులందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి, జనసేనకు అనుకూలంగా మార్చే ప్రక్రియలో భాగమే ఇదంతా అన్న వాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.ఎందుకంటే చిరు ఇంట పెళ్లి జరిగినపుడే పవన్ హాజరు కాలేదు అటువంటిది పవన్ ఇప్పుడు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేకపోవడం, ఆ పార్టీలో ఉన్నా పెద్దగా వచ్చే ప్రయోజనం కూడా లేకపోవడంతో చిరు కూడా రాజకీయ ప్రత్యామ్న్యాయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడని, ఎవరో పార్టీలోకి వెళ్లే కంటే తన తమ్ముడు పార్టీలోకి వెళ్తే రాజకీయ ప్రాధాన్యం ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని అలాంటి పని చేసిన ప్రభాస్... మరీ ఇంత మంచోడివి ఏంటయ్యా!

ఇక జనసేనలోకి చిరు వస్తే ఆయనకు గౌరవ అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు పవన్ కూడా సిద్ధమైనట్టు జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.

Advertisement

తాజా వార్తలు