ఆరోగ్యానికి చికెన్ మంచిదా..? లేక చేపలు మంచివా..? నమ్మలేని నిజాలు చెప్పిన వైద్యులు..!

ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం అంటే చాలా ఇష్టపడతారు.మాంసా ఆహారాన్ని ఇష్టపడని వారంటూ ఉండరు.

అయితే అందులో కొంతమందికి చికెన్ ఇష్టం ఉంటే, మరి కొందరికి చేపలు అంటే ఇష్టం ఉంటాయి.చికెన్ అలాగే చేప ( Fish )రెండు కూడా తెల్లగా ఉంటాయి.

అయితే ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి మంచిది? పోషకాహార నిపుణుడు ప్రకారం చికెన్ లేదా చేపలు ఎక్కువగా ప్రయోజనకరంగా ఉన్నాయా? అనే దాని గురించి సబిరమైన సమాచారాన్ని అందించారు.నిపుణుల ప్రకారం చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్( Omega-3 Fatty Acids ) పుష్కలంగా ఉంటాయి.

అయితే ఈ పదార్థం గుండెకు చాలా మంచిది.ఇందులో ఫస్ట్ క్లాస్ ప్రోటీన్లు కూడా ఉంటాయి.

Is Chicken Good For Health Or Fish Is Good.. Doctors Who Told Unbelievable Tr
Advertisement
Is Chicken Good For Health? Or Fish Is Good..? Doctors Who Told Unbelievable Tr

ఈ రకమైన ప్రోటీన్ శరీరంలో సులభంగా జీర్ణం అవుతుంది.అయితే విటమిన్ బి2, విటమిన్ డి చేపలలో అధికంగా లభిస్తాయి.అంతేకాకుండా పొటాషియం, అయోడిన్, జింక్ లాంటి అనేక ముఖ్యమైన అంశాలు కూడా లభిస్తాయి.

అందుకే ఎవరైనా క్రమం తప్పకుండా చేపలు తినవచ్చు.దీనివలన గుండె, కళ్ళు, కిడ్నీలు సహా శరీరంలోని అనేక అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇక మరోవైపు చికెన్లో ప్రోటీన్లు ఉంటాయి.అదనంగా విటమిన్ b6, విటమిన్ బి12, మెగ్నీషియం, సెలీనియం, జింక్ ఇందులో ఉంటాయి.

అందుకే అన్ని వయసుల వారు కూడా చికెన్ క్రమం తప్పకుండా తినవచ్చు.ఇలా తినడం వలన ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తుంది.

Is Chicken Good For Health Or Fish Is Good.. Doctors Who Told Unbelievable Tr
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

అయితే ఇందులో ఏది ఎక్కువ ప్రయోజనకరమైనది అన్న విషయాన్నికొస్తే రెండు ఆహారాల్లోనూ కూడా ప్రోటీన్లు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.కానీ చికెన్ కంటే చేపల్లో ప్రోటీన్ నాణ్యత ఎక్కువగా ఉన్నాయి.ఇక మరికొందరికి చికెన్ కూడా జీర్ణం( Digestion ) కాదు.

Advertisement

అందుకే ఆరోగ్యవంతమైన శరీరానికి చికెన్ కంటే చేపలు తినడం చాలా మేలు.కానీ చేపలు, మాంసాహారం కలిపి రెగ్యులర్గా తినడం మంచిది కాదు.

ఇది శరీరంలో అదన ప్రోటీన్లకు దారితీస్తుంది.అధిక ప్రోటీన్ శరీరంలో నైట్రోజన్ అసమతుల్యతను కలిగిస్తుంది.

దీని ద్వారా వివిధ సమస్యలు వస్తాయి.

తాజా వార్తలు