ఆలియా భట్ మరో సౌత్ ఇండియన్ మూవీ లో నటించే అవకాశం ఉందా?

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) పెళ్లి అవ్వడం.ఆ వెంటనే గర్భం వల్ల సినిమాకు చిన్న బ్రేక్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

మళ్లీ ఈ అమ్మడు కొత్త సినిమాల ఎంపిక లో బిజీగా ఉంది.హీరోయిన్ గా గతంలో ఏ స్థాయిలో వరుస సినిమాలతో ఎంటర్ టైన్మెంట్‌ ను అందిచిందో అదే స్థాయిలో ఇక నుండి కూడా ఆలియా భట్ వరుస సినిమాలకు కమిట్ అవ్వాలని భావిస్తుందట.

అయితే సౌత్‌ లో ఆలియా మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా అంటే అనుమానమే అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే ఆర్‌ ఆర్‌ ఆర్‌ (RRR)సినిమా లో ఆలియా భట్‌ నటించింది.

ఆ సినిమా లో ఆలియా పాత్ర కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు.కానీ తీవ్రంగా నిరాశ పర్చింది.

Advertisement
Is Alia Bhatt Give Green Signal To South Movie Once Again , Alia Bhatt , Allu Ar

ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఆ సినిమా మరియు పాత్ర తో సౌత్‌ లో ఎంట్రీ ఇచ్చినందుకు ఆమె కు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ఆర్ ఆర్‌ ఆర్‌ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనక పోవడంతో పాటు పలు సార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేసిందట.

Is Alia Bhatt Give Green Signal To South Movie Once Again , Alia Bhatt , Allu Ar

తెలుగు లో నటించినందుకు ఇలా అవమానించారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.సోషల్‌ మీడియాలో ఆలియా భట్‌ ను చాలా మంది సౌత్ ప్రేక్షకులు అభిమానులు మీ తదుపరి సౌత్‌ సినిమా ఎప్పుడు అంటూ ప్రశ్నించారట.కానీ ఆమె నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు.

అయినా కూడా చాలా మంది అభిమానులు కచ్చితంగా ఆలియాను మళ్లీ సౌత్‌ సినిమా లో చూస్తామని నమ్మకంగా ఉన్నారు.అల్లు అర్జున్(Allu Arjun) అంటే అభిమానం అంటూ గతంలో చెప్పిన ఆలియా ఆయనతో నటించే అవకాశం వస్తే నటిస్తుందని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు