IPS Abhishek Verma : మారువేశంలో ఐపీఎస్ ఆఫీసర్.. పార్కింగ్ ఉద్యోగులు ఓవర్ ఛార్జ్ చేయడంతో..

ప్రపంచంలో దోపిడీకి పాల్పడే వారు ఎందరో ఉన్నారు.అడిగేవాడు లేడని అందిన కాడికి డబ్బులు అక్రమంగా సంపాదించే ఉద్యోగులు, వ్యాపారులు అన్ని రంగాల్లో ఉన్నారు.

 Ips Officer In Civilian Guise Overcharged For Parking Video Viral-TeluguStop.com

ఇలాంటి వారికి అప్పుడప్పుడు ఎవరో ఒకరు తగిన బుద్ధి చెప్తారు.తాజాగా ఉత్తరప్రదేశ్‌లో( Uttar Pradesh ) పార్కింగ్ సిబ్బంది దోపిడీకి పాల్పడుతూ ఐపీఎస్ అధికారికి దొంగ బుక్ అయ్యారు.

సీనియర్ పోలీసు అధికారి అభిషేక్ వర్మ( IPS Abhishek Verma ) పార్కింగ్ కోసం ఉద్యోగులు చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారని గమనించారు.హాపూర్‌లో పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వర్మ బ్రిజ్‌ఘాట్‌కు వెళ్లినప్పుడు యూనిఫాంలో ధరించలేదు.

అతను సాధారణ దుస్తులను ధరించారు.అతని కారు ముందు ప్రయాణీకుల సీటులో ఉన్నారు.

అతను మామూలు మనిషి అనుకొని సిబ్బంది పొరపాటు పడ్డారు.

ఏమీ జరగకముందే వర్మ తన ఫోన్‌లో రికార్డ్ చేయడం మొదలుపెట్టారు.

ఆ వీడియోలో పార్కింగ్ సిబ్బంది( Parking Staff ) డబ్బులుగా వాహనదారుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్న బాగోతం కూడా రికార్డు అయింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.అందులో వర్మ పార్కింగ్ మేనేజర్‌ని ఉద్దేశిస్తూ పార్కింగ్ రసీదులో రూ.53 మాత్రమే చెల్లించాలని ఉండగా ఎందుకు రూ.60 అడిగారని అడుగుతున్నట్లు కనిపించింది.

మొదట వీడియోలో పార్కింగ్ కాస్ట్ రోజూ మారుతుందని చెప్పాడు.కొన్నిసార్లు ₹50 చెల్లించిన సరిపోతుందన్నట్లు మాట్లాడాడు.ఆ తర్వాత పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే ఓ వ్యక్తి మాట్లాడుతూ.

పార్కింగ్ స్పేస్( Parking Space ) ఎంత బిజీగా ఉందో ధర కూడా ఆధారపడి ఉంటుందని చెప్పారు.రసీదులో రూ.53 ఉండి, 50 రూపాయలే తాము కలెక్ట్ చేసినట్లయితే మీరు ప్రశ్నించేవారు కాదు కదా అని కూడా ఐఏఎస్ ఆఫీసర్ తో ఆ వ్యక్తి మాట్లాడాడు.

కొత్త ధరలను చూపించని పాత రశీదు తనకు లభించిందని వర్మ చెప్పడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.అయితే ఆ తర్వాత రూల్స్ పాటించమని ఐఏఎస్ అధికారికే పార్కింగ్ మేనేజర్ నీతి బోధ చేశాడు.దాంతో అధికారికి కోపం వచ్చి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు ఆడతారా అని ఫైర్ అయ్యారు.

అలాగే పార్కింగ్ మేనేజర్‌తో కొందరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.పార్కింగ్ కోసం ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం ద్వారా ఎక్కువ డబ్బు రాబట్టే పెద్ద కుట్ర వీరు చేస్తున్నారని చేసిన నమోదు చేశారు.

ఈ ఘటన చూసి చాలామంది ఐపీఎస్ అధికారిని పొగుడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube