'సీతారామం' నుండి బాలాజీగా తరుణ్ భాస్కర్‌ ఫస్ట్ లుక్ విడుదల

యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ ‘సీతారామం’.దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు.

 Introducing Tharun Bhascker As Balaji In Sita Ramam ,tharun Bhascker , Balaji ,-TeluguStop.com

ప్రతి పాత్ర వినూత్నంగా పరిచయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అఫ్రీన్‌ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు.

తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రను బాలాజీగా పరిచయం చేశారు.ఈ లుక్ లో కూల్ డ్రింక్ తాగుతున్న తరుణ్ భాస్కర్ చాలా ట్రెండీగా కనిపించారు.

బాలాజీ పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో కూడా ఆసక్తికరంగా వుంది.”బాలాజీ హై నా.సబ్ సంభాల్ లేగా(బాలాజీ వున్నాడు.అంతా చూసుకుంటాడు) అని తరుణ్ భాస్కర్ చెప్పిన డైలాగ్ ఆయన పాత్రపై క్యూరియాసిటీని పెంచింది.‘సీతారామం’లోప్రతి పాత్ర కోసం మేకర్స్ తీసుకున్న శ్రద్ధ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్దమౌతుంది.వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube