ఆసక్తికరంగా ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ నుంచి రెండో టీజర్

విలక్షణ కథలను ఎంచుకుంటూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు ఆది సాయికుమార్.ఆయన తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’.

 Interestingly, Adi Saikumar's Second Teaser From 'tees Maar Khan' , Tees Maar Kh-TeluguStop.com

ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.చిత్రంలో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.

సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి రెండో టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు.

ఇందులో ఆది సాయి కుమార్ ఇది వరకెన్నడూ కనిపించనంత స్టైలీష్‌గా కనిపించారు.రౌడీ కాప్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లో మాస్ ఆడియెన్స్‌‌కు కిక్కిచ్చేలా ఉన్నారు.

ఇక పాయల్ రాజ్‌పుత్, ఆదిల రొమాన్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇచ్చేలా ఉంది.

ఈ తీస్ మార్ ఖాన్ ఎవరు?’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది.టీజర్ చివర్లో ‘అన్నా ప్లీజ్ అన్నా.ఒక్క పది నిమిషాలు.చంపను అన్నా.జస్ట్ కాళ్లు చేతులు విరగ్గొట్టి వెళ్లిపోతా.

’, ‘థ్యాంక్స్ ఫర్ గెలికింగ్ మీ.నౌ గెట్ రెడీ ఫర్ మై గెలికింగ్’ అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ తీస్ మార్ ఖాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు దర్శకనిర్మాతలు.చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ సినిమా, మొదటి టీజర్‌లు అంచనాలు పెంచేశాయి.

ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ లేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు.

స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్.ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.

బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు.మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.

నటీనటులు ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ , పూర్ణ తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube