వివాహమైన స్త్రీలు మంగళగౌరీ వ్రతం చేయడం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం, తన పసుపు కుంకుమలను కాపాడుకోవటం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు.

ఈ విధమైనటువంటి అన్ని నోములలో కెల్లా మంగళగౌరీ వ్రతం ఎంతో శుభప్రదమైనది.

పెళ్లైన స్త్రీలు శ్రావణమాసంలో తొలి మంగళవారం రోజు మంగళగౌరీ వ్రతం చేయటం వల్ల పది కాలాల పాటు సౌభాగ్యవతిగా ఉంటుందని భావిస్తారు.అయితే ఈ విధంగా మంగళగౌరీ వ్రతం చేయటం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

Interesting Facts About Mangala Gowri Vratham,mangala Gowri Vratham , Married Wo

అది ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేస్తారు.

ఈ విధంగా క్షీరసాగరమధనం చేసే సమయంలో సముద్రగర్భం నుంచి కాలకూట విషం ఉద్భవిస్తుంది.ఈ విషం సేవిస్తే కాని సముద్రం నుంచి అమృతం రాదు.

Advertisement

ఈ భయంకరమైన పరిస్థితులలో దేవదానవులు ఇద్దరు పరమేశ్వరుని వేడుకోగా తన తదుపరి కర్తవ్యం ఏమిటో సెలవివ్వలసిందిగా పరమేశ్వరుడు పార్వతీ వంక చూశాడు.పరమేశ్వరుడి ఆంతర్యం గ్రహించిన పార్వతీదేవి బిడ్డల యోగక్షేమాలను కాంక్షించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ తన సౌభాగ్యం పై ఎంతో నమ్మకం ఉంచి పరమేశ్వరుడు కాలకూట విషాన్ని సేవించడానికి అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

అంతట త్యాగమూర్తి అయిన పార్వతీ దేవిని సర్వమంగళ స్వరూపిణి పేరిట కొత్తగా వివాహమైన స్త్రీలు మంగళగౌరీ వ్రతం ఆచరిస్తే సౌభాగ్యంతో వర్ధిల్లు తారని పండితులు తెలియజేస్తున్నారు.అయితే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసం తొలి మంగళవారం ఆచరించాలి.

ఈ విధంగా 5 సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతం ఆచరించిన వారికి వైధవ్య బాధలు లేకుండా జీవితాంతం సర్వసౌఖ్యాలతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు