గర్భగుడిలో దేవుడి విగ్రహం లేని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

మన హిందూ దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొలువై ఉన్నాయి.అయితే ఇప్పటికీ కొన్ని ఆలయాలలో దాగిఉన్న వింతలు, రహస్యాలను ఇప్పటివరకు ఎవరూ చేదించలేదు.

ఈ విధంగా ఎన్నో వింతైన ఆలయాలు కూడా మనదేశంలో కొలువై ఉన్నాయి.అయితే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహానికి పూజలు చేసి  నమస్కరించుకుంటారు.

ఈ విధంగా గర్భగుడిలో ఉన్న స్వామి వారు భక్తుల కోరికలను తీరుస్తూ ప్రసిద్ధి చెంది ఉంటారు.కానీ మీరు ఎప్పుడైనా గర్భగుడిలో దేవుడి విగ్రహం లేని ఆలయాన్ని చూశారా.

వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! గర్భ గుడిలో దేవుడు లేకపోతే దానిని ఆలయం అని ఎలా అంటారనే సందేహం కలగకమానదు.అయితే ఈ విధంగా గర్భగుడిలో విగ్రహం లేని ఆలయం ఎక్కడ ఉంది.

Advertisement
Unknown Facts Behind Avudaiyarkoil Temple Of Tamil Nadu In Telugu, Interesting

ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.తమిళనాడులోని పుదుకోట్టాయ్ లో ఈ వింత ఆలయం ఉంది.

దీనిని అవుడయర్ కోయిల్ అంటారు.ఇక్కడ శివుడిని ఆత్మానంద స్వామిగా భక్తులు పూజిస్తారు.

అయితే ఈ ఆలయంలోని గర్భగుడిలో స్వామివారి విగ్రహం మన కంటికి కనిపించదు.అయినప్పటికీ ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.

మన శరీరంలోని ఆత్మ మనకు ఏవిధంగా అయితే కనిపించదో ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారు కూడా భక్తులకు కనిపించరు.మన శరీరంలోని ఆత్మ మన కంటికి కనిపించదని మన ఆత్మని మనం విశ్వసించకుండా ఉండలేము కదా.అదేవిధంగా ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం లేదని, అక్కడ పూజలు చేయడం మానలేదు.

Unknown Facts Behind Avudaiyarkoil Temple Of Tamil Nadu In Telugu, Interesting
దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

మనం ఏదైనా శివాలయానికి వెళ్తే అక్కడ గర్భగుడిలో శివలింగం ,శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు బయట ధ్వజస్తంభం కనిపిస్తుంది.కానీ ఆత్మానంద స్వామి ఆలయంలో మాత్రం గర్భగుడిలో శివలింగం ఉండదు. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఆలయం బయట ధ్వజస్తంభం మనకు కనిపించదు.

Advertisement

అదే విధంగా ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారిని యోగంబాల్ అని పిలుస్తారు.అయితే ఈ అమ్మవారు కూడా మనకు కనిపించరు.

ఏ ఆలయంలో నైనా నవగ్రహాలు మండపంలో ఉంటాయి కానీ ఈ ఆలయం లో మాత్రం నవగ్రహాలు స్తంభాలపై చెక్కబడి ఉంటాయి.ఈ ఆలయంలో విగ్రహం లేకపోయినా అనువనువున పరమేశ్వరుడు ఉంటాడని భక్తులు భావిస్తారు.

అందుకోసమే ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా పెట్టే అన్నం నుంచి వచ్చే ఆవిరిని భక్తులు దైవంగా భావించి పూజలు చేస్తారు.

తాజా వార్తలు