ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై టీఎస్ హైకోర్టులో విచారణ

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.సిట్, బీజేపీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను విచారించింది.

ఈ క్రమంలో సిట్ నోటీసులను రద్దు చేయలేమని కోర్టు తెలిపింది.బీఎల్ సంతోష్, శ్రీనివాస్ లకు 41 (ఏ) సీఆర్పీసీ నోటీసులు ఇవ్వడం మీడియాకు ఎలా లీక్ అవుతున్నాయని న్యాయస్థానం ప్రశ్నించింది.

బీజేపీ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం.సిట్ దర్యాప్తు గోప్యంగా ఉంచాలని సూచించింది.అదేవిధంగా సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు వెల్లడించింది.41 (ఏ) సీఆర్పీసీ కింద అరెస్ట్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది.తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేసేందుకు వీలు లేదని, సిట్ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు