బక్రీద్‎కు జంతు వధపై తెలంగాణ హైకోర్టులో విచారణ

బక్రీద్‎ పండగకు జంతువధపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖను న్యాయస్థానం సుమోటో పిటిషన్ గా స్వీకరించింది.

అయితే మతపరమైన మనోభావాలు దెబ్బతినే విధంగా గోవధ జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు.దీనిపై చర్యలు తీసుకోవాలంటూ బక్రీద్ కు ఒక్క రోజు ముందు లేఖ రాయడం తగదని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

సున్నితమైన అంశాల్లో చివరి నిమిషంలో వచ్చి హైకోర్టును లాగితే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది.ఈ క్రమంలో గోవధ, గోవుల అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకున్నామని ఏజీ తెలిపారు.

ఇందుకోసం చెక్ పోస్టులు పెట్టి కేసులు నమోదు చేస్తున్నామన్నారు.ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు గోవధ నిషేధ చట్టం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

అదేవిధంగా సీఎస్, డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.నిజమైన స్ఫూర్తితో బక్రీద్ జరుపుకోవాలన్న కోర్టు ఆగస్ట్ 2న నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు