విశాఖపట్నం తీరం వెంబడి, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆశానీ తుఫాన్ ప్రభావంతో విశాఖ నగరంలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాలలో నివసించే వారు, తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు,కొండవాలు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని తెలియజేశారు.అత్యవసర పరిస్థితిలో 1800 4250 0009 కానీ 0891 2869106 కాల్ చేయాలని కోరడమైనది.
పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ