అర్హతలు ఉన్నా సాయిపల్లవికి దక్కని అవార్డ్.. మరీ ఇంత అన్యాయమా అంటూ?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి( Sai Pallavi ) ఒకరు కాగా ఆమె యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

తాజాగా 70వ జాతీయ ఫిలిం అవార్డులను ప్రకటించగా ఈ అవార్డులలో ఉత్తమ నటిగా నిత్యామీనన్( Nithya Menon ) ఎంపిక కావడం జరిగింది.

తిరుచిత్రాంబళం అనే సినిమాకు నిత్యామీనన్ కు ఈ అవార్డు వచ్చింది.అయితే ఈ అవార్డు దక్కాల్సిన హీరోయిన్ సాయి పల్లవి అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

2022 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు సంబంధించి అవార్డులను ప్రకటించగా అదే సంవత్సరం సాయి పల్లవి నటించిన గార్గి సినిమా( Gargi Movie ) థియేటర్లలో విడుదలైంది.సౌత్ ఇండియాలో అప్పట్లో ప్రశంసలు పొందిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.భాషతో సంబంధం లేకుండా సౌత్ భాషల్లోని ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలించిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.

సాయి పల్లవి అభిమానులు సైతం ఆమెకు కచ్చితంగా అవార్డు వస్తుందని భావించగా అందుకు భిన్నంగా జరగడం అభిమానులకు అసంతృప్తిని కలిగిస్తోంది.

Advertisement

సాయి పల్లవి ఫిలింఫేర్ అవార్డుల( Filmfare Awards ) విషయంలో సత్తా చాటిన సంగతి తెలిసిందే.ఆమెకు ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే ఎక్కువ సంఖ్యలో ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.ఈ ఏడాది నిత్యామీనన్ తో పాటు మానసి పరెక్( Manasi Parekh ) అనే మరో నటికి కూడా జాతీయ అవార్డును ప్రకటించడం అభిమానుల్లో మరింత అసహనానికి కారణమైందని చెప్పవచ్చు.

అభిమానులు అగ్రహానికి లోనవుతున్న నేపథ్యంలో తనకు అవార్డు దక్కకపోవడం గురించి సాయి పల్లవి రియాక్ట్ అవతారేమో చూడాల్సి ఉంది.ప్రస్తుతం తండేల్ సినిమాతో సాయి పల్లవి బిజీగా ఉండటం కొసమెరుపు.

సాయిపల్లవి మార్కెట్ పెరుగుతున్నా పరిమితంగానే పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.సాయిపల్లవి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు