అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధం చాలా మధురమైనది.అక్క తన తమ్ముడిని( Brother ) తల్లి లాగా చూసుకుంటుంది.
అతడు మంచి ప్రయోజకుడు కావాలని ఎంతో తపన పడుతుంది.తమ్ముడు విజయం సాధిస్తే అక్క( Sister ) ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.
తాజాగా ఒక ఎల్డర్ సిస్టర్ తన బేబీ బ్రదర్ సక్సెస్ అవ్వడంతో చాలా సంతోషించింది.తాను పనిచేస్తున్న విమానయాన సంస్థలోనే ఆ బ్రదర్ కి ఉద్యోగం వచ్చింది.
అయితే జాయిన్ అయ్యే ఫస్ట్ డే నాడు అతడిని విమానంలోకి చిన్న బహుమతితో ఆహ్వానించి సర్‌ప్రైజ్ చేసింది.
సోషల్ మీడియాలో వారిద్దరికీ సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో సేమ్ ఎయిర్‌లైన్ కంపెనీ ఇండిగోలో( Indigo ) పనిచేస్తున్న సోదరి, సోదరుడు అత్యంత ఆనందకరమైన క్షణాలను అనుభవించడం మనం చూడవచ్చు.అక్క ఫ్లైట్ అటెండెంట్( Flight Attendant ) కాగా తమ్ముడు గ్రౌండ్ స్టాఫ్( Ground Staff ) ఉద్యోగం సంపాదించాడు.
సోదరి విమానం ఎక్కగానే తన సోదరుడిని ఓ ప్రత్యేక బహుమతితో ఆశ్చర్యపరిచింది.
ఆమె పేరు రియా రాజేష్ దేవకర్.( Riya Rajesh Deokar ) ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వీడియోను పోస్ట్ చేసింది.ఆ వీడియోతో పాటు తన సోదరుడిని చూసి తాను చాలా గర్వపడుతున్నానని, అతడిని తాను చాలా ప్రేమిస్తానని చెప్పింది.
ఇండిగోలో చేరినందుకు కంగ్రాట్యులేషన్స్ కూడా చెప్పింది.వీడియో స్క్రీన్‌పై కొన్ని పదాలతో ప్రారంభమవుతుంది.
“గర్వంగా ఉన్న సిస్టర్”( Proud Sister ) అని పదాలు వీడియో పై రాశారు.ఇందులో అక్క తన సోదరుడు విమానంలోకి ప్రవేశించడాన్ని చూస్తుంది.
అతన్ని కౌగిలించుకుని స్వాగతం పలుకుతుంది.ఫ్లైట్ అటెండెంట్ కాబట్టి బ్లూ కలర్ యూనిఫాం ధరించింది.
అతను గ్రౌండ్ స్టాఫ్ కాబట్టి యెల్లో కలర్ యూనిఫాంలో కనిపించాడు.
అక్క తమ్ముడికి ప్రత్యేక బహుమతిని చూపడంతో వీడియో కొనసాగుతుంది.ఆమె అతనికి ఒక నోట్ కూడా రాసింది.అతని పట్ల సంతోషంగా ఉందని, అతను ఇండిగో కుటుంబంలో ఒక భాగమని పేర్కొంది.
ఇండిగోలో తమ్ముడు ఏమి చేస్తున్నాడో కూడా వీడియో చూపిస్తుంది.అతను అసోసియేట్ టెక్నీషియన్ ఇంజనీరింగ్.
విమానాలను నిర్వహించడానికి, మరమ్మతు చేయడానికి సహాయం చేస్తాడు.వీరిద్దరి వీడియోకు 30 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోను మీరు చూసేయండి.