కెనడాలో పడిపోతున్న భారతీయ విద్యార్ధుల రిజిస్ట్రేషన్లు .. ఎందుకిలా ..?

భారతీయ విద్యార్ధులు విదేశాల్లో చదువుకోవాలంటే వారికి ఫస్ట్ ఛాయిస్ అమెరికా( America ) అయితే , సెకండ్ కెనడానే .

మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, మంచి ఉద్యోగావకాశాలు వుండటంతో పలు దేశాల విద్యార్ధులు కెనడాకు క్యూ కడుతున్నారు.

అలాగే సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా జారీ, త్వరగా శాశ్వత నివాస హోదా వంటి అనుకూల అంశాలు కెనడా వైపు విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి.అయితే కెనడియన్ ప్రభుత్వం చేసిన ఇటీవలి విధాన మార్పులు భారతీయ విద్యార్ధుల నమోదులో గణనీయమైన క్షీణతకు కారణమవుతున్నాయి.2023లో జారీ చేసిన స్టడీ వీసాలలో 37 శాతం అందుకుని అతిపెద్ద జాతీయ సమూహంగా ఉన్న భారతీయులు ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.ప్రస్తుతం కెనడాను తమ విద్యా గమ్యస్థానం ఎంచుకునే భారతీయ విద్యార్ధులను అనేక అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

Indian Student Applications To Canada Drop After Bilateral Tensions, Housing Cri

విధాన మార్పులు, ఆర్ధిక భారాలు, దౌత్యపరమైన ఉద్రిక్తతలు, కఠినమైన వర్క్ పర్మిట్ పరిమితులు, పరిమిత అధ్యయన అనుమతులు, కఠినమైన అర్హత ప్రమాణాలు సహా కెనడియన్ ప్రభుత్వ విధానాలు భారతీయ విద్యార్ధుల ప్రవేశానికి ఆటంకం కలిగిస్తున్నాయి.2023లో 3,19,000 మంది భారతీయ విద్యార్ధులు కెనడాకు వెళ్లగా .2024లో కెనడా ( Canada)అధ్యయన అనుమతుల సంఖ్యను 3,60,000కి పరిమితం చేసినట్లు ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) డేటా చెబుతోంది.ఇది మునుపటి ఏడాది కంటే 35 శాతం తగ్గింపు.

Indian Student Applications To Canada Drop After Bilateral Tensions, Housing Cri

అంతర్జాతీయ విద్యార్ధుల సంఖ్యను స్థీరీకరించడానికి ఉద్దేశించిన పరిమితుల కారణంగా భారతీయ విద్యార్ధులకు అనుమతులు పొందడం కష్టతరంగా మారింది.అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు భారతీయ విద్యార్ధులకు జారీ చేసిన స్టడీ పర్మిట్లలో 1,08,940 నుంచి 14,910కి తగ్గింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య అనంతరం భారత్ - కెనడాల మధ్య చోటు చేసుకున్న దౌత్యపరమైన వివాదాల కారణంగా అనుమతులను ప్రాసెస్ చేసే కెనడియన్ దౌత్య సిబ్బందిని భారత్ బహిష్కరించడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Advertisement
Indian Student Applications To Canada Drop After Bilateral Tensions, Housing Cri

ఉన్నత విద్య నిమిత్తం కెనడా వచ్చే అంతర్జాతీయ విద్యార్ధుల జనాభాలో భారతీయ విద్యార్ధులు 41 శాతం పైనే ఉన్నారు.దేశ ఆర్ధిక వృద్ధికి వీరు గణనీయంగా తోడ్పాటును అందిస్తున్నారు.ఒక్క పంజాబ్‌కు చెందిన విద్యార్ధులే కెనడాలో చదువుకునేందుకు ఏటా దాదాపు రూ.68,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని అంచనా.2022లో 2,25,450 మంది భారతీయ విద్యార్ధులకు స్టడీ పర్మిట్‌లు మంజూరైతే వీరిలో 1.36 లక్షల మంది పంజాబ్‌( Punjab )కు చెందినవారు.ప్రస్తుతం పంజాబ్‌కు చెందిన 3.4 లక్షల మంది విద్యార్ధులు కెనడాలో చదువుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.ప్రస్తుతం గృహ సంక్షోభం, జీవన వ్యయాల పెరుగుదల కారణంగా కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్ధుల రాకపై కొన్ని పరిమితులు విధిస్తోంది.

వావ్, జపాన్ స్కూళ్లలో పిల్లల భోజనం చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది!
Advertisement

తాజా వార్తలు