ఇండియన్ రైల్వేస్: బ్రేక్ ఫాస్ట్ తర్వాత ప్రయాణికులకు టీ ఇవ్వనందుకు లక్షరూపాయల ఫైన్!

భారతీయ రైల్వే ఇపుడు ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా పెను మార్పులను తీసుకొస్తోంది.ఈ క్రమంలోనే చాలా వరకు రైల్వే స్టేషన్‌లు, రైళ్లలో అనేక మార్పులు సంభవించాయి.

 Indian Railways: Rs 1 Lakh Fine For Not Giving Tea To Passengers After Breakfast-TeluguStop.com

రైళ్లు, రైల్వే స్టేషన్లు చాలా పరిశుభ్రంగా వున్నాయి.రైళ్లు సమయానికి రాకపోకలు సాగిస్తున్నాయి.

అయితే గతంలో పోల్చితే, పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ.కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

రైల్వే ప్రయాణికులకు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవలు, ఆహారం అందించడంపై భారతీయ రైల్వే దృష్టిసారించింది.

ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతోంది.అందులో భాగంగా నిబంధనలను పాటించని కాంట్రాక్టర్లపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు.

తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రయాణికుల పట్ల మన రైల్వే వారి కేర్ ని సూచిస్తుంది.వివరాల్లోకి వెళితే, బ్రేక్ ఫాస్ట్ తర్వాత ప్రయాణికులకు టీ ఇవ్వనందుకు గాను.

ఏకంగా లక్షరూపాయల ఫైన్ విధించింది.అవును.

రైళ్లలో ప్రయాణికులు అందుతున్న సేవలు, సమస్యల గురించి తెలుసుకునేందుకు Passenger Service Committee టీమ్ బుధవారం Jan shatabdi expressలో ప్రయాణించింది.

ఈ క్రమంలో ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కి వెళ్లి.

అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది.సాధారణంగా జనశతాబ్ధి రైళ్లలో ప్రయాణికులకు భోజన వసతి ఉంటుంది.

తరువాత టీ, స్నాక్స్ కూడా ఇస్తుంటారు.వీటి చార్జీలు టికెట్‌తో పాటే వసూలు చేస్తారు.

ఐతే జనశతాబ్ధి రైల్లో ప్రయాణించిన ప్యాసింజర్ సర్వీస్ కమిటీ మాత్రం అందులో ప్రయాణికులకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ తర్వాత ప్రయాణికులకు టీ ఇవ్వడం లేదని కమిటీ సభ్యులు గుర్తించడం జరిగింది.

ఈ క్రమంలో రైలు బోగీలు కూడా అపరిశుభ్రంగా కనిపించడంతో సదరు కాంట్రాక్ట్ కంపెనీకి Indian Railway Catering and Tourism Corporation భారీగా జరిమానా విధించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube