బాధ్యత గల వృత్తిలో వుండి.నలుగురికి చెప్పాల్సింది పోయి తానే చట్టం ముందు దోషిగా నిలబడ్డాడో భారత సంతతి పోలీస్ అధికారి.
నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మహిళ మరణానికి కారణమైనందుకు ఆ అధికారికి యూకే కోర్టు( UK court ) జైలు శిక్ష విధించింది.నిందితుడిని పోలీస్ కానిస్టేబుల్ నదీమ్ పటేల్( Nadeem Patel ) (28)గా గుర్తించారు.ఇతను 2021 జూన్‌లో తన పెట్రోలింగ్ కారును అత్యంత వేగంగా నడుపుతూ.25 ఏళ్ల శాంటే డేనియల్ ఫోల్క్స్ అనే మహిళను ఢీకొట్టాడు.
పటేల్ వాహనం కంటే ముందు పోలీస్ కారును నడుపుతున్న సహచర అధికారి పీసీ గ్యారీ థామ్సన్( PC Gary Thomson ) (31) నాలుగు రోజుల విచారణ తర్వాత లండన్‌లోని ఓల్డ్ బెయిలీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.దీంతో పటేల్‌ను జ్యూరీ దోషిగా తేల్చింది.
ఈ సందర్భంగా క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్( Crown Prosecution Service ) (సీపీఎస్) స్పెషల్ క్రైమ్ డివిజన్ హెడ్ రోజ్‌మేరీ ఐన్స్‌లీ మాట్లాడుతూ.నిర్లక్ష్యంగా కారును నడిపి డేనియల్ మరణానికి కారణమైనట్లు పటేల్ అంగీకరించాడని చెప్పారు.
ఈ క్రమంలో కోర్ట్ తీర్పు.బాధితురాలి కుటుంబానికి కొంత ఓదార్పునిస్తుందని రోజ్‌మేరీ ఆకాంక్షించారు.

ప్రమాదం జరిగిన ప్రదేశంలో పాదచారి బాటలు, సైక్లిస్టులు వెళ్లే మార్గం, ఓపెన్ కన్వీనియన్స్ స్టోర్, క్విజ్ నైట్ అనే పబ్ వున్నాయని ఆమె చెప్పారు.ఆ చీకటిలో అత్యంత వేగంతో వాహనాలు గనుక ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మేరీ అన్నారు.మృతురాలు డేనియల్ ఫోల్క్స్( Daniel Folks ) రాత్రి 11.20 గంటల సమయంలో పాదచారుల క్రాసింగ్‌కు దగ్గరగా రోడ్డు మీద నడుస్తున్నారని కోర్టు దృష్టికి వచ్చింది.థామ్సన్ వాహనం ఎమర్జెన్సీ లైట్లు, సైరన్ యాక్టివేట్ చేస్తూ ఆమెను దాటి వెళ్లిందని తేలింది.ఆ వెంటనే మూడు నుంచి నాలుగు సెకన్ల సమయం తర్వాత డేనియల్ ఇంకా రోడ్డును క్రాస్ చేస్తూనే వుండగా పటేల్ వాహనం ఢీకొట్టింది.

కారు చివరి స్టాపింగ్ పాయింట్ నుంచి కేవలం 115 మీటర్ల దూరంలోని స్టాక్‌వెల్ రోడ్‌లో పటేల్ 83.9 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకున్నారని సీపీఎస్ పేర్కొంది.ఆ సమయంలో రెండు సార్లు పటేల్ బ్రేక్ వేయడంతో కారు వేగం 55 కి.మీగా వుంది.అప్పుడే డేనియల్‌ను అతను ఢీకొట్టాడని సీపీఎస్ పేర్కొంది.ఈ నేరానికి గాను పటేల్‌కు మూడేళ్ల జైలు శిక్ష, నాలుగేళ్ల పాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధించింది కోర్ట్.