స్టార్‌‌బక్స్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్ నరసింహన్..!!

Indian-Origin Laxman Narasimhan Take Charge As Starbucks CEO , Indian-Origin , Laxman Narasimhan , Starbucks , David Malpass , Joe Biden , Starbucks CEO

అంతర్జాతీయ సంస్థ స్టార్‌బక్స్( Starbucks ) సీఈవోగా భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ లక్ష్మణ్ నరసింహన్( Laxman Narasimhan ) బాధ్యతలు చేపట్టారు.అక్టోబర్ 1న లక్ష్మణ్ కంపెనీలో చేరుతారని.

 Indian-origin Laxman Narasimhan Take Charge As Starbucks Ceo , Indian-origin ,-TeluguStop.com

కానీ 2023 ఏప్రిల్‌లో సీఈవోగా బాధ్యతలు చేపడతారని స్టార్‌బక్స్ గతేడాది సెప్టెంబర్‌లోనే ఓ ప్రకటనలో తెలిపింది.అప్పటి వరకు హోవార్డ్ షుల్ట్జ్ తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారని వెల్లడించింది.

అయితే నిర్ణీత తేదీకంటే ముందే లక్ష్మణ్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించినట్లు స్టార్‌బక్స్ తెలిపింది.స్టార్​‌బక్స్‌​ సీఈఓగా బాధ్యతలు చేపట్టడం కోసం.బ్రిటన్ రాజధాని లండన్​ నుంచి అమెరికాలోని సీటెల్​ ప్రాంతానికి వలస వెళ్లనున్నారు లక్ష్మణ్​.

55 ఏళ్ల లక్ష్మణ్ ప్రస్తుతం రెకిట్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.పూణే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన.పెన్సిల్వేనియా వర్సిటీ అనుబంధ లాడర్ ఇన్స్‌స్టిట్యూట్ నుంచి జర్మన్, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేచేశారు.అలాగే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం అనుబంధ వార్టన్ స్కూల్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.రెకిట్‌లో ప్రవేశించడానికి ముందు పెప్సికోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా వ్యవహరించిన లక్ష్మణ్.

లాటిన్ అమెరికా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లో సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించేవారు.అలాగే మెకిన్సే కంపెనీలో సీనియర్ పార్ట్‌నర్‌గానూ లక్ష్మణ్ పనిచేశారు.

Telugu Ajay Banga, David Malpass, Joe Biden, Laxman Simhan, Satya Nadella, Ceo,

లక్ష్మణ్‌‌ రాకతో కార్పోరేట్ ప్రపంచాన్ని ఏలుతున్న భారతీయుల సంఖ్య మరింత పెరిగినట్లయ్యింది.ఇప్పటికే సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, మనీష్ శర్మ, లీనా నాయర్, ఇంద్రా నూయి వంటి భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.దీనికి తోడు భారత సంతతికి చెందిన అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా తరపున నామినేట్ చేశారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden )సాధారణంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష బాధ్యతలను తొలి నుంచి అమెరికా పౌరులే నిర్వర్తిస్తుండగా. ఐఎంఎఫ్‌కు సారథిగా యూరోపియన్లు వ్యవహరిస్తూ వస్తున్నారు.

Telugu Ajay Banga, David Malpass, Joe Biden, Laxman Simhan, Satya Nadella, Ceo,

ప్రపంచ బ్యాంక్‌లో అమెరికా అతిపెద్ద వాటాదారు.ప్రస్తుత వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు డేనిస్ మాల్పాస్ ఈ ఏడాది చివరిలో తన పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో అజయ్ బంగా పేరును ఈ పదవికి నామినేట్ చేశారు జో బైడెన్.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube