యూఏఈలో( UAE ) విషాదం చోటు చేసుకుంది.భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా చంపిన భారతీయుడు, ఆపై 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.మంగళవారం సాయంత్రం షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పారామెడిక్స్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు గల్ఫ్ న్యూస్ వార్తాపత్రిక నివేదించింది.ఇతను భారతదేశానికి చెందినవాడని, 30 ఏళ్ల వయసు వుంటుందని చెప్పారు.
అయితే మృతుడి గుర్తింపు గురించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.పిల్లల విషయానికి వస్తే నాలుగేళ్ల బాబు, ఎనిమిదేళ్ల పాపగా తెలుస్తోంది.
అయితే మృతుడు దూకిన అంతస్తు వద్ద సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అందులో 11వ అంతస్తులోని తమ ఫ్లాట్‌లో వున్న మృతదేహాలను తరలించాల్సిందిగా రాసివుంది.
తొలుత ఇతను మాత్రమే ఆత్మహత్య చేసుకున్నాడని భావించిన పోలీసులు ఈ పరిణామంతో షాక్‌కు గురయ్యారు.

వెంటనే అతని ఫ్లాట్‌కి వెళ్లి అక్కడ పడివున్న మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించారు.ఈ ఘటనకు దారితీసిన కారణాలు తెలియరాలేదని షార్జా పోలీసులు( Sharjah Police ) పేర్కొన్నారు.గడిచిన ఆరు నెలలుగా మృతుడి కుటుంబం ఈ భవనంలో నివసిస్తోంది.
అందుబాటులో వున్న డేటా ప్రకారం యూఏఈలో దాదాపు 38,60,000 మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు.ఇది ఎమిరేట్స్ మొత్తం జనాభాలో 38 శాతానికి పైనే.

ఇదిలావుండగా.గత నెలలో దుబాయ్‌లో ( Dubai ) జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.మృతులను షఫీ సుల్లెదా, అతని భార్య షిరాజ్ బేగం, కుమార్తె షిఫా, తల్లీ బీబీ జాన్‌గా గుర్తించారు.షఫీ తన కుటుంబ సభ్యులతో కలిసి రాయచూరు నుంచి మక్కాకు వెళ్లాడు.ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు కంటైనర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.







