నా భర్తను ఎవరు, ఎందుకు చంపారు :కెనడాలో హత్యకు గురైన భారతీయుడి సతీమణి పోరాటం

న్యూ ఇయర్ సందర్భంగా కెనడాలోని మిల్ వుడ్స్‌ ఇంట్లోకి చొరబడటమే కాకుండా 51 ఏళ్ల సిక్కు వ్యక్తిని కాల్చిచంపారు దుండగులు.

ఈ ఘటనకు సంబంధించి బాధితుడి భార్య.

తనకు న్యాయం చేయాలని కోరుతోంది.పంజాబ్‌కు చెందిన బరీందర్ సింగ్ .కుటుంబంతో సహా 2019లో ఎడ్మాంటన్‌కు వలస వెళ్లాడు.కాల్పులు చోటు చేసుకున్న రోజున తెల్లవారుజామున 2.45 గంటలకు పోలీసులు పొలార్డ్ మెడోస్ పరిసరాల్లోని కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు.గాయపడిన 51 ఏళ్ల బరీందర్ రక్తపు మడుగులో పడివున్నాడు.

అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

పోస్ట్‌మార్టం రిపోర్టులో వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు.ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా తెలుస్తోంది.

Advertisement

దీనిపై అతని భార్య జస్జీత్ కౌర్ గ్లోబల్‌ న్యూస్‌తో మాట్లాడుతూ.ఇదంతా తమకు పీడకల మాదిరిగా వున్నారు.తమకు న్యాయం కావాలని.

దీనిని ఎవరు చేశారో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.తన కుటుంబాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చిందని జస్జీత్ కౌర్ డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై పోలీస్ అధికారులు స్పందించారు.ఈ హింసాత్మక నేరానికి దారి తీసిన కారణాలను గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో లారెల్ పరిసరాల్లో దగ్దమైన ఓ ట్రక్కును పోలీసులు గుర్తించారు.ఇది నేరస్థులకు సంబంధించినదిగా వారు అనుమానిస్తున్నారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

ఇదిలావుండగా.కెనడాలో భారత సంతతి వ్యక్తులు వరుసగా హత్యలకు గురవుతుండటం కలకలం రేపుతోంది.డిసెంబర్ 3న మిస్సిసాగాలోని గ్యాస్ స్టేషన్ వెలుపల 21 ఏళ్ల పవన్ ప్రీత్ కౌర్ అనే పంజాబీ సంతతికి చెందిన యువతిని దుండగులు కాల్చిచంపారు.

Advertisement

తర్వాత కొద్దిరోజులకే బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో 40 ఏళ్ల హర్‌ప్రీత్ కౌర్ అనే సిక్కు మహిళను దుండగులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు.ఇది సద్దుమణగకముందే అల్బెర్టా ప్రావిన్స్‌కు చెందిన 24 ఏళ్ల సంరాజ్ సింగ్‌‌‌ను సైతం కత్తితో పొడిచి చంపారు.