బ్రహ్మాస్త్ర నుంచి RRR వరకు ఇండియా లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఇవే !

ఈ మధ్యకాలంలో సినిమాలు తీసే పద్ధతి మారుతూ వస్తుంది.సినిమా ఎంత రిచ్ గా ఉంటే అంత బాగా హిట్ అవుతుందని కొంతమంది నమ్ముతున్నారు.

అందుకే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఇండస్ట్రీలో రూపుదిద్దుకుంటున్నాయి.ప్రేక్షకులను అంచనాలు పెంచేందుకు విజువల్ వండర్స్ ని క్రియేట్ చేస్తున్నారు దర్శకులు.

దాంతో నిర్మాతలు కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు అయితే మన ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.టైగర్ జిందా హై2015 లో వచ్చిన ఆ టైగర్ జిందా హై సినిమా 210 కోట్లతో రూపుదిద్దుకొని ఈ జాబితాలో పదవ స్థానంలో ఉంది ఈ చిత్రంలో కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ హీరో, హీరోయిన్స్ గా నటించగా 565 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.పద్మావతి2017 లోనే వచ్చిన ఈ సినిమాలో దీపికా పదుకొనే, రన్వీర్ సింగ్ హీరో, హీరోయిన్స్ గా నటించారు వీరియాడికల్ డ్రామాగా తిరిగిన ఈ చిత్రం బడ్జెట్ 215 కోట్లు.అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా 545 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.బాహుబలి 1

2017లో విడుదలైన బాహుబలి మొదటి పార్ట్ సినిమా కోసం రాజమౌళి 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు.ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1600 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.832021 లో వచ్చిన 83 సినిమా 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న సమయంలో వచ్చిన కథాంశంగా తెరకెక్కింది.ఈ చిత్రంలో రన్వీర్ సింగ్ హీరోగా నటించిన 270 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ చిత్రం కలెక్షన్స్ మాత్రం 186 కోట్లు మాత్రమే.తగ్స్ అఫ్ హిందుస్థాన్

Advertisement

అమీర్ ఖాన్ హీరోగా నటించిన తగ్స్ అఫ్ హిందుస్థాన్ సినిమా 310 కోట్లతో తెరకెక్కి 2018 లో విడుదల అయ్యింది.ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 245 కోట్లు మాత్రమే వసూలు చేసింది.రాధే శ్యామ్ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా రాధే శ్యామ్.300 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టి తీసిన ఈ చిత్రం 200 కోట్లు మాత్రమే వసూలు చేసింది.సాహూ

ప్రభాస్ నటించిన మరొక భారీ బడ్జెట్ సినిమా సాహూ.ఈ సినిమా కోసం 300 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టగ 430 కోట్ల భారీ వసూళ్లు సాధించింది.బ్రహ్మాస్త్రఅలియా భట్ హీరోయిన్ గా, రణభీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా వసూళ్ల వేట కొనసాగిస్తోంది.మరికొన్ని రోజులు ఆగితే కానీ వీరి కలెక్షన్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.రోబో 2.0రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం లో వచ్చిన మూవీ రోబో 2.0.500 కోట్లతో తెరకెక్కిన ఈ విజువల్ అద్భుతం 519 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.RRR

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, తారక్ హీరోలుగా నటించిన సినిమా RRR.ఈ చిత్రం కోసం ఏకంగా 550 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టగ 1200 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు