కెనడాలో ఖలిస్తాన్ ( Khalistan in Canada )వేర్పాటువాదులు, వారి మద్ధతుదారుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఖలిస్తాన్ రెఫరెండం, రోడ్లపై ర్యాలీలు, అడ్డొచ్చిన భారతీయులను చితకబాదడం, హిందూ ఆలయాలపై దాడులతో వారు భయాందోళనలకు గురిచేస్తున్నారు.
తాజాగా బ్రిటీష్ కొలంబియాలోని సర్రే పట్టణంలోని లక్ష్మీ నారాయణ మందిరం( Lakshmi Narayana Mandir ) గోడలపై మంగళవారం తెల్లవారుజామున అలాంటి పోస్టర్లే దర్శనమిచ్చాయి.ఆ ఆలయాన్ని గతంలో ఆగస్ట్ 12న కూడా అపవిత్రం చేశారు దుండగులు.
ఈ పోస్టర్లలో ఒట్టావాలోని భారత హైకమీషనర్, ఇద్దరు కేంద్ర మంత్రుల ఫోటోలను టార్గెట్ చేస్తూ గోడలపై ఖలిస్తాన్ అనుకూల పోస్టర్‌లను అతికించారు.
గతంలో ఆగస్ట్ 15కు ముందు అతికించిన పోస్టర్‌లలో ఒట్టావాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma ), టొరంటో, వాంకోవర్‌లోని కాన్సుల్ జనరల్స్ వున్నారు.
తాజా పోస్టర్‌లో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, హోం వ్యవహారాల మంత్రి అమిత్ షాలను దుండగులు ప్రస్తావించారు .సర్రే పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాంటెడ్ అనే పదంతో కొత్త పోస్టర్లను అతికించారు ఖలిస్తాన్ వేర్పాటువాదులు.ఇంతకుముందు కిల్ ఇండియా పోస్టర్ల మాదిరిగానే.వివిధ ప్రదేశాల్లో అతికించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మెట్రో వాంకోవర్ ప్రాంతంలోని బీఏపీఎస్ నారాయణ సంస్థ( BAPS Narayana Institute ), శ్రీ వెంకటేశ్వర మహావిష్ణు ఆలయం, శ్రీమాతా భామేశ్వరి దుర్గా దేవాలయాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు.సెప్టెంబర్ 10న సర్రేలో సిక్కు వేర్పాటువాద సంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’ (ఎస్ఎఫ్‌జే) నిర్వహించనున్న ఖలిస్తాన్ రెఫరెండానికి ముందు పట్టణంలో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.ఈ ఘటనలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదంటూ కెనడా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా.జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )దారుణహత్యకు గురయ్యాడు.గురునానక్ సింగ్ గురుద్వారా సాహిబ్ పార్కింగ్ ప్లేస్‌లో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.దీని వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందని ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు.
ఆ తర్వాతి నుంచే ఎస్ఎఫ్‌జే బెదిరింపులు పెరిగాయి.భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ, టొరంటో, వాంకోవర్‌లలోని భారత కాన్సుల్ జనరల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ‘‘కిల్ ఇండియా’’ పోస్టర్లు వెలిశాయి.







