ఒకప్పటి క్రికెటర్.. ఇప్పటి టీ స్టాల్ సెల్లర్..! ఎవరంటే..?!

ఒకప్పుడు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని బతికిన వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోని కష్టాలను అనుభవించాలిసి రావచ్చు.

అలాంటి వాళ్ళను మనం చాలామందినే చూసి ఉంటాము.

కాలం కలిసి రాకపోతే బళ్ళు ఓడలు అవ్వవచ్చు.ఓడలు బళ్ళు అవ్వవచ్చు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు గుర్తు ఉందా.

ఒకప్పుడు ఎంతో పేరు, ప్రఖ్యాతలు, డబ్బు, ఆస్తులు సంపాదించుకున్న వారే ఇప్పుడు ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఎదో ఒక ఊరిలో వాళ్లకి తోచిన పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.అలాంటి వాళ్లలో ఒకప్పుడు మన టీమిండియాకు సహాయం చేసిన స్పిన్నర్ ప్రకాశ్ భగవత్ కూడా ఒకరు అనే చెప్పాలి.

ఆయన ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలిస్తే మీరే షాక్ అవుతారు.ఒక మారు మూల ప్రాతంలో రోడ్డు పక్కన టీ, దాల్, రోటీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Advertisement
Indian Former Spinner Prakash Bhagat Is Selling Tea At Road Side, Assam, Assam S

ప్రస్తుతం ఈ స్పిన్నర్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.ఒకసారి వివరాల్లోకి వెళితే.2003 సంవత్సరంలో న్యూజిలాండ్ టూర్ కు టీమిండియా వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది.కానీ.

న్యూజిలాండ్ జట్టులో ఉన్న క్రికెటర్ వెటోరి బౌలింగ్ బాగా చేస్తాడు.అతని బౌలింగ్ కి భారత క్రీడాకారులు చాలానే ఇబ్బందులు పడేవారట.

అయితే అతన్ని ఎదుర్కోవాలంటే ఏమి చేయాలి అనే ఆలోచనలో అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నారట.అప్పుడే అస్సాం రాష్ట్రానికి చెందిన ఎడమ చేతి వాటం కలిగిన స్పిన్నర్ ప్రకాశ్ భగవత్ గుర్తుకు వచ్చి ఆయనని పిలవడం జరిగింది.

Indian Former Spinner Prakash Bhagat Is Selling Tea At Road Side, Assam, Assam S

అనంతరం న్యూజిలాండ్ స్పిన్నర్ వెటోరిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు భారత క్రికెటర్లు.తర్వాత అస్సాం తరపున ప్రకాశ్ భగత్ పలు మ్యాచ్ లు ఆడారు.గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, సచిన్ లకు బౌలింగ్ కూడా చేశారట.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

బీహార్ తో జరిగిన ఓ మ్యాచ్ లో ఏడు వికెట్లు పడగొట్టిన ఘనత ప్రకాశ్ భగత్ కె సొంతం.కొన్నాళ్ళకు ప్రకాశ్ తండ్రి గారు చనిపోవడంతో క్రమంగా క్రికెట్ కు దూరమయ్యాడు.

Advertisement

తండ్రి లేకపోవడంతో కుటుంబ భారం మొత్తం ప్రకాశ్ మీద పడడంతో రోడ్డు పక్కన టీ, దాల్ రోటీ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ప్రస్తుతం ప్రకాశ్ అస్సాం లోని కాచర్ జిల్లాలోని సిల్చార్ పట్టణంలోని తాఖోల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రకాశ్ మాట్లాడుతూ అప్పట్లో అస్సాం టీమ్ కి తనతో కలిసి ఆడిన క్రికెటర్లు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని, కానీ నేను మాత్రం ఇలా రోడ్డు పక్కన టీ షాపు నడుపుకుంటు జీవిస్తున్నానని ప్రకాశ్ వెల్లడించారు.ప్రస్తుతానికి తన ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, రోజుకు మూడు పూటల భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే సౌరవ్ గంగూలీకి బౌలింగ్ చేసిన క్షణాలు ఎప్పటికి మరిచిపోలేనవని తెలిపారు.

తాజా వార్తలు