అమెరికాలో సిక్కు పోలీస్ అధికారి గడ్డం వ్యవహారం.. రంగంలోకి ఇండియన్ ఎంబసీ

న్యూయార్క్ రాష్ట్రంలో సిక్కు పోలీస్ అధికారికి( Sikh Police ) పెళ్లి కోసం గడ్డం పెంచుకోవడానికి అధికారులు అనుమతి నిరాకరించిన ఇష్యూ అమెరికా, భారత్‌లలో దుమారం రేపింది.దీనిపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం( Indian Embassy ) రంగంలోకి దిగింది.

 Indian Embassy Objects To New York State Police Barring Sikh Trooper From Growin-TeluguStop.com

ఇది మతపరమైన వివక్షేనంటూ చట్టసభ సభ్యులు వాఖ్యానించడంతో ఎంబసీ జోక్యం చేసుకుంది.ఇక్కడి భారతీయ అధికారులు న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.

యూఎస్‌లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు( Taranjit Singh Sandhu ) సైతం బైడెన్ పరిపాలనా యంత్రాంగంలోని సీనియర్ స్థాయి అధికారులతో సంప్రదించారు.న్యూయార్క్ రాష్ట్ర పోలీసులు, గవర్నర్ కార్యాలయం కూడా దీనిపై కసరత్తు చేస్తున్నాయని ఎంబసీ అధికారులు తెలిపారు.

న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీలో క్వీన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ సభ్యుడు డేవిడ్ వెప్రిన్ మాట్లాడుతూ.గడ్డం పెంచుతానంటూ తివానా చేసిన అభ్యర్ధనను తిరస్కరించడాన్ని న్యూయార్క్ స్టేట్ పోలీస్‌లో( New York State Police ) మత వివక్షగా అభివర్ణించారు.

సిక్కు అధికారుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ.న్యూయార్క్ రాష్ట్రం దేశంలో అత్యంత వైవిధ్యభరితమైన రాష్ట్రమన్నారు.తమకు మతం, విశ్వాసాల పేరు చెప్పి వివక్ష చూపితే తగినంత మంది పోలీస్ అధికారులు వుండరని ఆయన సీబీఎస్ ఛానెల్‌తో అన్నారు.

కాగా.

న్యూయార్క్ స్టేట్ ట్రూపర్స్ పోలీస్ బెనివొలెంట్ అసోసియేషన్ ప్రకారం.ఆరేళ్లుగా స్టేట్ ట్రూపర్‌గా విధులు నిర్వర్తిస్తున్న చరణ్‌జోత్ తివానా( Charanjot Tiwana ) తన పెళ్లి కోసం గడ్డం పెంచుకోవాలనుకున్నాడు.

ఇందుకోసం అధికారులను అనుమతి కోరారు.అయితే భద్రతా కారణాలు, న్యూయార్క్ చట్టాల ప్రకాల తివానాకి అనుమతి నిరాకరించారు.

సిక్కు పురుషులు తలపాగా ధరించడంతో పాటు వారి మత విశ్వాసాల్లో భాగంగా జుట్టు, గడ్డాన్ని కత్తిరించరు.కానీ న్యూయార్క్ పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం.

సాయుధ బలగాల్లో పనిచేసేవారు జట్టును కత్తిరించుకోవడంతో పాటు క్లీన్ షేవ్‌తో వుండాలి.

Telugu America, America Sikha, Beard, Harjindersingh, Indian Embassy, Joe Biden,

మరోవైపు.సిక్కులకు అత్యున్నత స్థాయి నిర్ణాయక విభాగాలైన అకల్ తఖ్త్, శిరోమణి గురుద్వారా పర్భంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ)లు ఈ వ్యవహారంపై ఫైర్ అయ్యాయి.సిక్కుల మత విశ్వాసాలు, ఆచారాలను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని అకల్ తఖ్త్ జాతేదార్ గియానీ రఘ్‌బీర్ సింగ్ పేర్కొన్నారు.

యూఎస్ మిలటరీలో పనిచేసేందుకు సిక్కులు న్యాయపోరాటంలో విజయం సాధించారని.అలాంటిది ఎన్‌వైపీడీ మాత్రం ఒక సిక్కు అధికారిని గడ్డం పెంచుకోకుండా ఎందుకు ఆపిందని రఘ్‌బీర్ ప్రశ్నించారు.

Telugu America, America Sikha, Beard, Harjindersingh, Indian Embassy, Joe Biden,

ఇకపోతే.ఈ ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు ఎస్‌జీపీసీ చీఫ్ హర్జిందర్ సింగ్ ధామి.( Harjinder Singh Dhami ) సిక్కులను సిక్కుల్లాగే విధులు నిర్వర్తించేలా సంబంధిత అధికారులు అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.గడ్డం కత్తిరించకుండానే గ్యాస్ మాస్క్‌ను సులభంగా ధరించవచ్చని ధామి పేర్కొన్నారు.

ఈ సమస్యపై తక్షణం దృష్టి సారించాలని , అమెరికాలోని సిక్కుల హక్కులను పరిరక్షించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube