నొప్పిని భరిస్తూ సినిమాల్లో నటిస్తున్న స్టార్ హీరోలు, హీరోయిన్లు వీళ్లే?

స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు సంతోషకరమైన జీవనాన్ని గడుపుతుంటారని మనలో చాలామంది భావిస్తారు.

అయితే ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ పైకి సంతోషంగా కనిపించే సెలబ్రిటీలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

బాలీవుడ్ బాద్ షాగా పేరును సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ కొన్నేళ్ల క్రితం కొన్ని రోజుల పాటు మానసిక ఒత్తిడిని అనుభవించారు.దిల్ వాలే అనే సినిమా షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్ కండరాలలో చీలికలు వచ్చాయి.

అభిమానుల ఆశీస్సులు, ఐపీఎల్ మ్యాచ్ ల వల్ల షారుఖ్ ఖాన్ ఆరోగ్యవంతుడు అయ్యారు.తన సినిమాల ద్వారా యువత హృదయాలను దోచుకున్న ఇలియానా బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అనే వ్యాధితో బాధ పడ్డారు.

ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ బ్రాంకైంటిస్ అనే వ్యాధితో బాధ పడ్డారు.

Advertisement

ఈ వ్యాధి కొరకు రజినీకాంత్ సింగపూర్ లో చికిత్స తీసుకున్నారు.

స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే మెటస్టాటిక్ క్యాన్సర్ బారిన పడి అమెరికాలో చికిత్స తీసుకున్నారు.స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ టీనేజ్ నుంచి డయాబెటిస్ తో బాధ పడ్డారు.ఆహారం విషయంలో నియంత్రణతో పాటు వ్యాయామం చేయడం వల్ల సోనమ్ కపూర్ సన్నగా మారారు.

మరో హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధ పడ్డారు.ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే కమల్ హాసన్ డయాబెటిస్ తో బాధ పడుతున్నారు.

స్టార్ హీరోయిన్ నయనతారకు మేకప్ వల్ల ముఖంపై వల్లభ షూటింగ్ సమయంలో దద్దుర్ల సమస్య వచ్చింది.అమితాబ్ బచ్చన్ మ్యాస్తేనియా గ్రావిస్, సమంత పాలీమార్ఫష్ లైట్ ఎరప్షన్, దీపికా పదుకొనే మానసిక ఒత్తిడి, సల్మాన్ ట్రిగెమినల్ న్యూరాల్జియా, మనిషా కోయిరాలా అండాశయ క్యాన్సర్ సమస్యలతో బాధ పడుతున్నారు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు