భారత సంతతి పోలీస్ అధికారి ఇప్పుడు అమెరికాలో హీరో.. ఏం చేశారంటే..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం పొట్ట చేత పట్టుకుని అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.

తాము చేస్తున్న పనిలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు భారతీయులు తీవ్రంగా శ్రమిస్తారు.

అదే వారిని అత్యున్నత స్థాయిలో నిలబెడుతోంది.ఇక ధైర్య సాహసాల్లోనూ ఇండియన్స్‌ని కొట్టేవారు లేరు.

ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది.తాజాగా అమెరికాలో ఓ భారత సంతతి పోలీస్ అధికారి ఇప్పుడు హీరోగా అవతరించాడు.

ఓ పోలీసును కాల్చి చంపి.మరొకరిని గాయపరిచిన ఓ దుండగుడిని ఇండో అమెరికన్ పోలీస్ అధికారి చాకచక్యంగా పట్టుకున్నారు.

Advertisement
Indian-American Cop Hailed As Hero For Neutralising Gunman Who Killed Officer, T

ఓ ఇంట్లో గొడవ జరిగినట్లు జనవరి 21న పోలీసులకు సమాచారం అందింది.ఆ ఇంటికి చేరుకున్న పోలీసు సిబ్బందిపై దుండగుడు ఆకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు.

ఈ ఘటనలో జాసన్ రివెరా (22) అనే అధికారి మరణించగా. విల్బర్ట్ మోరా (27) గాయపడ్డాడు.

ఈ ఊహించని పరిణామంతో షాక్‌కు గురైన భారత సంతతికి చెందిన సుమిత్ సులెన్ (27) వెంటనే తేరుకుని దుండగుడు లాషాన్ మెక్‌నీల్ (47)పై కాల్పులు జరిపాడు.ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సాయుధుడిని అదుపులోకి తీసుకునే ముందు .సులెన్ బాధిత మహిళ, ఆమె కుమారుడిని సురక్షితంగా తరలించాడు.తన కుమారుడు తనను బెదిరిస్తున్నాడని మెక్‌నీల్ తల్లి పోలీసులకు సమాచారం అందించడంతో .సులెన్ స్పందించారు.వెంటనే అతని ఇద్దరు సహచరులతో కలిసి మెక్‌నీల్ ఫ్లాట్‌కు వెళ్లారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

మెక్‌నీల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించే సమయానికి నిందితుడు 50 రౌండ్ల సామర్ధ్యంతో వున్న గ్లాక్ పిస్టల్‌తో కాల్పులు జరుపుతున్నాడు.శుక్రవారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటన .ఈ నెలలో పోలీస్ అధికారులపై జరిగిన మూడవ తుపాకీ దాడి.ఇటీవల న్యూయార్క్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన మాజీ పోలీస్ అధికారి ఎరిక్ ఆడమ్స్‌కు ఈ తరహా ఘటనలు సవాల్ విసురుతున్నాయి.

Advertisement

పోలీస్ అధికారులపై కాల్పులు జరగడాన్ని ఆడమ్స్‌ ‘‘నగరంపై దాడి’’గా అభివర్ణించారు.

ఈ ఘటనపై సుమిత్ తల్లి.దల్వీర్ సులెన్ న్యూయార్క్ పోస్ట్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.‘‘తాను గర్వపడుతున్నానని.

అతను చాలా మంచి చేశాడని ప్రశంసించారు.వీరి కుటుంబం 15 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చింది.

ఏప్రిల్ 2021లో పోలీస్ శాఖలో పోస్టింగ్ పొందిన సుమిత్ సులెన్‌కు సూపర్ రూకీ అనే పేరు వచ్చింది.పోలీస్ శాఖలో చేరడానికి ముందు న్యూయార్క్ నగరంలో టాక్సీ, లిమోసిన్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేశాడు.

తాజా వార్తలు