మూడో టెస్టులో తడబడ్డ భారత్.. ఆసీస్ లక్ష్యం 76 పరుగులు..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా 4 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో రెండు మ్యాచ్ లలో అద్భుత ఆటను ప్రదర్శించి భారత్ ఇండోర్ లో జరిగే మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఓటమి దిశగా సాగుతోంది.రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకే భారత్ ఆల్ అవుట్ అయింది.

 India Faltered In The Third Test.. Aussies Target 76 Runs, Aussies, Rohit Sharma-TeluguStop.com

ఆసీస్ కు కేవలం 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.జరిగిన 3 మ్యాచ్ లలో రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఒకరకంగా, మూడవ టెస్ట్ మ్యాచ్ లో మరోరకంగా ఆట తీరు సాగింది.

పూజారా 59 పరుగులు చేసి ఉండకపోతే, ఇన్నింగ్స్ తేడాతో భారత్ విఫలం అయ్యేది.

శ్రేయస్ అయ్యర్ (26) రెండు సిక్స్ లు, మూడు ఫోర్లు బాదిన ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు.

రోహిత్ శర్మ(12 ), శుబ్ మన్ గీల్ (2), విరాట్ కోహ్లీ (13), రవీంద్ర జడేజా (4), కె.ఎస్ భరత్(3), అశ్విన్(16) పరుగులు చేశారు.ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లయోన్ 8 వికెట్లు తీయగా.మిచెల్ స్టార్క్, కునేమన్ చెరొక వికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 109 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులు వచ్చేసింది.ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 197 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా స్వల్ప లక్ష్యం 76 పరుగులు చేస్తే మూడో టెస్ట్ మ్యాచ్లో విజయం సొంతం అవుతుంది.రెండవ ఇన్నింగ్స్ లో రోహిత్ సేన స్పిన్ బౌలర్లతో ఫీల్డింగ్ కట్టుదిట్టం చేస్తేనే మ్యాచ్ లో విజయం సాధించగలరు.

ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటర్లకు 76 పరుగుల లక్ష్యసాధన పెద్ద కష్టం ఏమి కాదు.ఇక రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేష్ , అక్షర్ పటేల్ లు ఏ విధంగా ఆస్ట్రేలియా బ్యాటర్ల పై ఎలా ఎదురు దాడి చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube