ఎన్టీయార్, ప్రశాంత్ నీల్ సినిమాకి పెరుగుతున్న డిమాండ్...

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలతో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరో జూనియర్ ఎన్టీఆర్.

ఇప్పటివరకు ఆయన ఏడు విజయాలను సాధించాడు.

ప్రస్తుతం ఆయన వార్ 2 (War 2)సినిమాను కూడా కంప్లీట్ చేశారు.ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన షూట్ స్టార్ట్ అయింది.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సైతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

Increasing Demand For Ntr And Prashant Neels Movie..., Ntr And Prashant , Jr Nt

వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ (NTR)ఈ సినిమా షూట్ లో పాల్గొంటాడు.మరి ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.ఇక ఎలాంటి పాత్రలో అయిన సరే ఒదిగిపోయి నటించగలిగే కెపాసిటి ఉన్న నటుడు ఎన్టీఆర్.

Advertisement
Increasing Demand For NTR And Prashant Neel's Movie..., NTR And Prashant , Jr Nt

మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన విజయాలు ఒకెత్తైతే ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

పాన్ ఇండియాలో తన తోటి హీరోలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ భారీ వసూళ్లను కొల్లగొడుతున్న సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)మాత్రం కొంతవరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి.

Increasing Demand For Ntr And Prashant Neels Movie..., Ntr And Prashant , Jr Nt

ఇప్పటివరకు ఆయనకు ఒక ఇండస్ట్రీ హిట్టు కూడా దక్కలేదు.మరి ప్రశాంత్ నీల్(Prashanth Neil) తో చేస్తున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్)(Dragon (Working Title)) సినిమాతో 2000 కోట్లు మార్కును టచ్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక అందుకోసమే ప్రశాంత్ నీల్ కూడా తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడట.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించి భారీ కలెక్షన్స్ ని రాబట్టడంలో సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.

తద్వారా ఈ సినిమాతో అటు ప్రశాంత్ నీల్ కి, ఇటు ఎన్టీయార్ కి ఎలాంటి ఇమేజ్ వస్తుందనేది.

సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?
Advertisement

తాజా వార్తలు