కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే వీటిని కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాల్సిందే..

చాలామంది ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా పండ్లను, కూరగాయలను తీసుకుంటూ ఉంటారు.అయితే కూరగాయలతో మన శరీరానికి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి.

కూరగాయలతో మనకు ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ లభిస్తాయి.దీని వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది.

అలాగే మన శరీరం అనారోగ్యాల పాలవ్వకుండా ఉంటుంది.అయితే అలాంటి కూరగాయల్లో క్యాబేజీ కూడా ఒకటి.

క్యాబేజీ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.అయితే క్యాబేజీలో మన శరీరానికి కావలసిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఆంటీ ఆక్సిడెంట్స్, అమినో ఆసిడ్స్, ఫ్లావనాయిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి అందువలన ఇది తినడం వల్ల మన ఆరోగ్యం అనారోగ్యాల పాలవకుండా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

అయితే చాలామంది బరువు తగ్గాలని డైట్ చేస్తూ ఉంటారు.అలాగే జిమ్ లకు వెళ్లి ఎంతో శ్రమ చిందిస్తూ ఉంటారు.

అయితే వీటితో పాటు మనం రోజువారి ఆహారంలో క్యాబేజీని చేర్చుకుంటే మన శరీరానికి కావాల్సిన ఫైబర్స్ అంది మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.దీంతో సులభంగా బరువు కూడా తగ్గవచ్చు.

అలాగే ఊబకాయం, గుండెపోటు, హైబీపీ వంటి అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు.అలాగే క్యాబేజీ లో ఉండే ఫైబర్ స్థాయి మన శరీరంలో ఉండే చక్కెర నిల్వను తగ్గిస్తుంది.

అలాగే కొలెస్ట్రాల్ నిల్వను కూడా తగ్గించి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.అలాగే రక్తపోటు, మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా ఇది రక్షిస్తుంది.అలాగే క్యాబేజీలో ఉన్న పీచు పదార్థం, అమినో ఆసిడ్స్ మనం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి.అలాగే శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి గ్లూకోస్ స్థాయిని తగ్గిస్తుంది.అలాగే కడుపులో నులిపురుగు సమస్యతో బాధపడుతున్న వాళ్లు కూడా క్యాబేజీ తింటే ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు.

Advertisement

తద్వారా మనం రోజువారి ఆహారంలో క్యాబేజీని చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

తాజా వార్తలు