AP Congress : ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్ష..!

ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్( AP Congress ) ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతోంది.రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( PCC chief YS Sharmila ) దీక్షల్లో పాల్గొన్నారు.

 Inauguration Under The Leadership Of Ap Congress In Delhi-TeluguStop.com

ఇందులో ప్రధానంగా విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు.పోలవరం పూర్తి చేస్తామని మోదీ( Narendra Modi ) ఇచ్చిన హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు.

విభజన జరిగి పదేళ్ల అయినా ఏపీకి రాజధాని లేదన్నారు.కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏదని ప్రశ్నించారు.ఏపీ ఎంపీలంతా బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని ఆరోపించారు.పోలవరం కట్టకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube