తిరుమలలో శుక్రవారం రోజు భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. ఇన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు.

అంతే కాకుండా స్వామి వారికి పూజలు, అభిషేకాలు చేసి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు.

సాధారణంగా తిరుమల లో శుక్రవారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 22 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.గురువారం రోజు శ్రీవారిని దాదాపు 58 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

అంతే కాకుండా దాదాపు 24 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకుల ద్వారా హుండీ ఆదాయం దాదాపు రూ.3 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

In Tirumala, The Rush Of Devotees Increased On Friday.. Devotees Waiting In So M
Advertisement
In Tirumala, The Rush Of Devotees Increased On Friday.. Devotees Waiting In So M

తిరుమల శ్రీవారి దేవాలయంతో పాటు ఇతర అనుబంధ దేవాలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకలుగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను మార్చి 7వ తేదీ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేనున్నట్లు అధికారులు తెలిపారు.ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్‌, సొనాటా, టైమ్‌వెల్‌, ఫాస్ట్ ట్రాక్ కంపెనీల వస్తువులు ఉన్నాయని వెల్లడించారు.

In Tirumala, The Rush Of Devotees Increased On Friday.. Devotees Waiting In So M

వివో, నోకియా, కార్బన్, సాంసన్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లో ఉన్నాయని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.కొత్తవి, ఉపయోగించిన, పక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 22 లాట్లు, మొబైల్ ఫోన్లు 18 లాట్లు ఈ- వేలం లో ఉంచామని తిరుమల దేవస్థాన అధికారులు వెల్లడించారు.ఇతర వివరాలకు తిరుమలలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబర్ లో కార్యాలయం వేళలలో టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.

ap.gov.in ను సంప్రదించాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు