నంద్యాల,ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో 'పెద్ద పులి' పిల్లల కలకలం...!

పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గుర్తించిన గ్రామస్థులు.

కుక్కలు దాడి చేసి గాయ పరచకుండా గది లో భద్రపరిచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన గ్రామస్థులు.

కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామం పెద్ద పులుల లభ్యం ఘటన లో ఫారెస్ట్ అధికారుల చర్యలు.అధిక వేడి దృష్ట్యా డీహైడ్రేషన్ కు గురైన నాలుగు పెద్ద పులి పిల్లల ను బైర్లూటి వైల్డ్ వెటర్నరీ హాస్పిటల్ కు తరలించిన అధికారులు.

నాలుగు పిల్లలు.ఆడ పిల్లలు, చాలా అరుదైన ఘటన ఇది, పిల్లల ఆరోగ్య పరిస్తితి మెరుగు పడ్డాక రాత్రికి తల్లి పిల్లలను కలిపే ప్రయత్నం చేస్తాం.

సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీ శాఖ అధికారులు.

Advertisement
వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?

తాజా వార్తలు