చిత్తూరు నియోజకవర్గంలో కత్తిపోట్ల కలకలం.. వైసీపీ ఏజెంట్ పై దాడి

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కత్తిపోట్ల కలకలం చెలరేగింది.గుడిపాల మండలం మండి కృష్ణాపురంలో వైసీపీ ఏజెంట్( YCP Agent ) పై దాడి జరిగింది.

దొంగ ఓట్లను వినియోగిస్తున్నారంటూ వైసీపీ, టీడీపీ( YCP , TDP ) వర్గీయుల మధ్య వివాదం కొనసాగుతోంది.అది కాస్తా ముదరడంతో పోలింగ్ కేంద్రం వద్దనే వైసీపీ ఏజెంట్ సురేశ్ పై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

సురేశ్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటినా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

అయితే ఉద్దేశ పూర్వకంగానే తమ పార్టీ ఏజెంట్ సురేశ్ పై కత్తితో దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు