15 నెలల్లో రూ. 36.53 లక్షలు పెరిగిన మోదీ ఆదాయం !

ప్రధాన మంత్రితో పాటుగా కేబినెట్ ‌లోని ఇతర మంత్రులు ప్రతి సంవత్సరం తమ తాజా ఆస్తుల వివరాలను ప్రధాని కార్యాలయానికి అందజేయడం ఓ ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఏడాది కూడా ప్రధానితో పాటు ఇతర మంత్రులు తమ ఆస్తులను పీఎం వోకు అందజేస్తుంటారు.

అలాగే ఈ ఏడాది కూడా దేశ ప్రధాని మోదీ తో పాటుగా మంత్రులు కూడా తమ ఆస్తుల జాభితాను అందజేశారు.తాజాగా ప్రధాని కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాతి పోలిస్తే ప్రధాని మోదీ ఆస్తుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.మోదీ చరాస్తులు గత 15 నెలల కాలంలో రూ.36.53 లక్షలు పెరిగింది.మోదీ గతంలో పీఎంవో ప్రకటించినప్పుడు చరాస్తుల విలువ రూ.1,39,10,260 ఉండగా , తాజాగా పీఎంవో ప్రకటించిన వివరాల్లో రూ.1,75,63,618కి పెరిగింది.ఒక మధ్య తరగతి వ్యక్తి మాదిరే ఆయన తన జీతంలో అధిక భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్సుడు డిపాజిట్లు చేశారు.

గుజరాత్ గాంధీనగర్ లో తన కుటుంబంతో కలిపి ఇల్లు, స్థలం ఉంది.ఈ వివరాలను ప్రధాని కార్యాలయం వెల్లడించింది.ప్రతి నెలా జీతాన్ని ఫిక్సుడు చేయడం వల్ల మోదీ చరాస్తుల వివరాల్లో పెరుగుదల కనిపించింది.

ఆయితే , మోదీ స్థిరాస్తుల్లో మాత్రం ఎలాంటి తేడా లేదు.గాంధీనగర్ లో ఉన్న ఇల్లు, స్థలం విలువ రూ.1.1 కోట్లు.ఆయనకు జీవిత బీమా ఉంది.

Advertisement

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో కూడా పొదుపు చేశారు.జూన్ 30 నాటికి ఆయన పొదుపు ఖాతాలో రూ.3.38 లక్షలు ఉన్నాయి.ఆయన వద్ద నగదు రూపంలో రూ.31,450 ఉన్నాయి.ఆయన పేరుతో వాహనాలు కూడా లేవు.

కేవలం 45 గ్రాముల బరువుండే లక్షన్నర విలువైన నాలుగు బంగారు ఉంగరాలు మాత్రమే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు