ఇమ్రాన్ పోస్ట్ కు నెటిజన్ల చురకలు

సగం తెలిసి తెలియకుండా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడితే ఇక నెటిజన్లు వారిని ఒక ఆడుకుంటారు.

ఈ క్రమంలో వారు దేశాధినేతలను సైతం వదిలిపెట్టారు.

సరిగ్గా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.బుధవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక సూక్తి పోస్ట్ చేసి, దాన్ని రాసింది ఖలీల్ జిబ్రాన్ అంటూ ట్వీట్ చేశారు.

ఆంతే దానిని పట్టుకున్న నెటిజన్లు అసలు ఆసూక్తి ఎవరు రాశారు అన్నదానిపై ఆరా తీయగా, అది చెప్పింది జిబ్రాన్ కాదు,విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అని తేలింది.దీనితో ఇక నెటిజన్లు ఇమ్రాన్ ను ఒక ఆట ఆడుకున్నారు.

‘‘జీవితమంతా సంతోషభరితమని.నేను నిద్రపోయి కల కన్నాను.

Advertisement

నేను నిద్రలేచి చూశాను.జీవితమంతా సేవ అని తెలిసింది.

చివరకు సేవ చేయడమే సంతోషభరితమని గుర్తించాను’’ అని ఓ సూక్తిని పేర్కొని అది రాసింది జిబ్రాన్‌ అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు.దీంతో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.

‘‘ఇది రాసింది రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.కానీ, ఇమ్రాన్ మాత్రం ఆ వాక్యాన్ని రాసింది జిబ్రాన్ అంటూ ట్వీట్ చేయడం తో పాకిస్థాన్‌ తన గురించి తాను జాగ్రత్తలు వహించాలి.

ఎందుకంటే మీ దేశ ప్రధాని స్థిరంగాలేరు అంటూ ఒక నెటిజన్‌ విమర్శించారు.‘‘ఇమ్రాన్‌ నుంచి మరో తెలివి తక్కువ ట్వీట్ వచ్చింది’’ అని ఇంకొకరు సెటైర్‌ వేశారు.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!

మరి నెటిజన్ అయితే ‘‘మిస్టర్‌ ప్రధాని మీరు ఎల్లప్పుడూ రైటే.మీకో దండం’’ అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

ఇలా ఒకొక్క నెటిజన్ ఒక్కొక కామెంట్ పెడుతూ ఆయనకు చురకలు అంటించారు.

తాజా వార్తలు