మన ఉగాది పండుగ యొక్క విశిష్టత తెలుసా ? అసలు పురాణాల ప్రకారం ఉగాది కథేంటి ...

ఉగాది పండుగ తెలుగు వారికి మొదటి పండుగ.దీనికి  యుగాది అని కూడా పేరు.

యుగాది అనగా యుగ+ఆది అని అర్ధము.యుగము అనగా జత అని అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము ఈ రెండిటిని కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము.

అది ఈ ఉగాది రోజు నుండి మొదలవుతుంది.మరోలా వివరించాలంటే ఉగాది అనగా "ఉ" అంటే నక్షత్రము అని , "గా "అనగా గమనం అంటే నక్షత్ర గమనము ఈ రోజు నుండి లెక్కించడం ప్రారంభం అవుతుంది అని చెప్పుకుంటాం.

1)ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది

ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు వస్తుంది.ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు.

ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరముగా జరుపుకుంటారు.ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలలోను జరుపుకుంటారు.

Advertisement
Importance Of Telugu Ugadi Festival , Ugadi Festival , Six Flavors, Devotional ,

మహారాష్ట్రలో ఈ పండుగను గుడి పత్వాగా, తమిళులు పుత్తాండుగా, పంజాబ్ లో వైశాఖి అని ఉగాది పండుగను పిలుస్తారు.ఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి , దేవుడికి పూజ చేస్తారు , దీనికి తోడుగా నూతన సంవత్సరం సందర్బంగా ఉగాది పచ్చడి చేసుకొని కుటుంబ సంభ్యులందరు దానిని తీసుకుంటారు.

ఇంకా పిండి వంటలను ప్రత్యేకంగా చేసుకుంటారు.

Importance Of Telugu Ugadi Festival , Ugadi Festival , Six Flavors, Devotional ,

2)ఉగాది పచ్చడి ప్రత్యేకత

ఈ ఉగాది పచ్చడిని ఆరు రుచుల (తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు) సమ్మేళనంతో తయారుచేస్తారు.ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదముగా తీసుకున్న తరువాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పొచ్చు అని కూడా చెప్తుంటారు.కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువగాని తక్కువగాని అవకుండా అన్ని సమపాళ్లలో ఎంతో జాగ్రత్తగా చేస్తారు.

3)మన పురాణాల ప్రకారం ఉగాది వెనక ఉన్న కథ

సృష్టికర్త ఐన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడట.ఆ నమ్మకం వల్ల నే కొత్త సంవత్సరం ప్రారంభం ఐన  రోజును ఉగాది అని పిలుస్తారు.

పురాణ గ్రంధాలలో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు.అలా మన ప్రతి ఉగాదితో ఆయనకు ఒక కొత్త రోజు మొదలవుతుంది.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

పురాణ గాధల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు.తనకు సహాయము చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణు మూర్తి మత్యవతారములో వెళ్లి సముద్రములో ఉన్న సోమకాసురుడుని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు.

Advertisement

అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ద పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి అలానే అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలు పెట్టారు.తెలుగు వారు ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుట ఆనవాయితీగా వస్తోంది.

తిథి , వార, నక్షత్ర.యోగం, కరణాలను అనే ఈ ఐదింటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం.

తాజా వార్తలు