ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలుకానుంది.ఈ మేరకు సెమిస్టర్ విధానాన్ని తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుండి తొమ్మిదో తరగతి వరకు రెండు సెమిస్టర్స్ ఉండనున్నాయి.అదేవిధంగా 2024- 25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో సెమిస్టర్ విధానం అమలు కానుందని అధికారులు వెల్లడించారు.







