యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థ పదార్ధాలు బయటికి వదిలేయడంతో రంగాపురం చెరువులోని నీళ్ళు పూర్తిగా విష పూరితమై చెరువులో చేపలు చనిపోతున్నయని మత్స్యకారులు,గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
అంతేకాకుండా ఆ చెరువు దగ్గరకు పశువులను పంపాలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కెమికల్ వ్యర్థాలతో చెరువు నీటిని కలుషితం చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.