ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఎక్కువసార్లు వాడేది గూగుల్ క్రోమ్ వెబ్‌బ్రౌజర్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు.ఇక ఆ తర్వాత స్థానంలో Firefox వుంది.
అవును, Mozilla Firefox ఇపుడు తన వినియోగదాదారులకు మెరుగైన బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.ఇందులో భాగంగానే ఫైర్‌ఫాక్స్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ వినియోగదారులకు తాజాగా ఓ శుభవార్తని అందించింది.
ఆండ్రాయిడ్ వెబ్ బ్రౌజర్‌కి 3 కొత్త ఎక్స్‌టెన్షన్‌లను కంపెనీ అందజేసింది.దీంతో వినియోగదారులకు మెరుగైన వెబ్ సర్ఫింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇకనుండి లభించనుంది.

దీని ద్వారా కొన్ని టాస్క్‌లను అత్యంత తేలికగా నిర్వర్తించే సదుపాయం కలదు.ఇక ఆ కొత్త ఎక్స్‌టెన్షన్‌ల విషయానికొస్తే…. Firefox Relay అనే ఎక్స్‌టెన్షన్ ఉపయోగించి వినియోగదారులు తమ ఇమెయిల్ అడ్రెస్‌ను హైడ్ చేసుకొనే వెసులుబాటు కలదు.ఈ ఎక్స్‌టెన్షన్ ఆన్‌లైన్ ఎంటిటీలు ఇమెయిల్ అడ్రెస్‌ను సేకరించి వాటిని మార్కెటింగ్ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా అడ్డుకుంటుంది.
ఆ తరువాత ReadAloud ఎక్స్‌టెన్షన్ అనే అప్డేట్ ద్వారా యూజర్లు బ్రౌజరలో ఓపెన్ చేసిన ఏదైనా ఆర్టికల్‌ను చదవాల్సిన అవసరం లేకుండానే వినే సదుపాయం కలదు.

అలాగే ClearUTL అనే మరో ఎక్స్‌టెన్షన్ ద్వారా అన్‌ప్రొటెక్టెడ్ లింక్‌లను అవాయిడ్ చేయొచ్చు.కాగా ఈ ఫీచర్ల గురించి Firefox తన బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విధంగా పేర్కొంది… ‘సైట్‌లు అనేక కారణాల వల్ల URLలలో ట్రాకింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటాయి.వీటి ద్వారా యూజర్‌ను ట్రాక్ చేసే అవకాశం కలదు.
ClearURL ఎక్స్‌టెన్షన్ లింక్‌ల నుంచి ట్రాకింగ్ ఎలిమెంట్‌లను పూర్తిగా తొలగిస్తాయి.కాబట్టి సురక్షితమైన, సరళమైన URL ఉంటుంది’ అని పేర్కొంది.
ఇకపోతే ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి Firefox, యాపిల్, గూగుల్ కంపెనీలు కలిసి పని చేస్తున్నాయి.







