జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరగాలంటే ఈ ఆయిల్ ను వాడాల్సిందే!

సాధారణంగా కొందరిలో జుట్టు విపరీతంగా రాలిపోతుంది.కానీ కొత్త జుట్టు అనేది రాదు.

దీని కారణంగా కురులు రోజురోజుకు పల్చగా మారిపోతూ ఉంటాయి.మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారా.? అయితే అస్సలు దిగులు చెందకండి.ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ ఆయిల్ ని కనుక వాడితే మీ జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరగడం స్టార్ట్ అవుతుంది.

ఒత్తైన, ఆరోగ్యమైన కురులు మీ సొంతం అవుతాయి.మరి ఇంతకీ ఆ హెయిర్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

If You Want To Reduce Hair Fall And Grow Thicker, You Have To Use This Oil Hair

ముందుగా రెండు కప్పుల వేపాకు( Neem leaves ) తీసుకొని వాటర్ తో కడిగి ఎండబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వేపాకులను లైట్ గా దంచుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut oil ) పోసుకోవాలి.

Advertisement
If You Want To Reduce Hair Fall And Grow Thicker, You Have To Use This Oil! Hair

అలాగే దంచుకున్న వేపాకు, రెండు టేబుల్ స్పూన్లు వాము, ఒక‌ టీ స్పూన్ అల్లం పొడి వేసి బాగా కలిపి చిన్న మంటపై కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.

కంప్లీట్ గా కూల్ అయ్యాక స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.

If You Want To Reduce Hair Fall And Grow Thicker, You Have To Use This Oil Hair

ఇక ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడటం వల్ల హెయిర్ రూట్స్ బలోపేతం అవుతాయి.

జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టు ద‌ట్టంగా పెరుగుతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

పైగా ఈ ఆయిల్ ను వాడడం వల్ల చుండ్రు సమస్యకు సైతం గుడ్ బాయ్ చెప్పేయొచ్చు.కాబట్టి ఆరోగ్యమైన దట్టమైన కురుల‌ను కోరుకునేవారు తప్పకుండా ఈ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Advertisement

మంచి రిసల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు