Vastu Shastra : మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అంతా సంతోషంగా ఉండాలంటే ఈ మొక్కలను అస్సలు పెంచకండి..

మన దేశం వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.అలాగే ఇంట్లో ప్రతి వస్తువును వాస్తు ప్రకారం ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు.

అంతేకాకుండా వారి ఇంటినే వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు.ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును వాస్తు ప్రకారం ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి పై సానుకూల ప్రభావం ఉంటుంది.

తాజా పువ్వులు కూడా ఇంట్లో సానుకూలతను తెస్తూ ఉంటాయి.సానుకూలత కోసం ప్రజలు తమ ఇంటిలోనే కాకుండా కార్యాలయాలలో క కూడా పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు.

అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం చెట్లు మొక్కలకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి.వాడిపోయిన పూలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
If You Want To Keep All The Family Members Happy In Your House Then Do Not Grow

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇల్లు అయినా, ఆఫీస్ అయినా వాడిపోయిన పూలను ఎక్కడ ఉంచకూడదు.వాడిపోయిన పూలు ఇంట్లో ఉంటే ఆ ప్రదేశాన్ని పాడు చేయడమే కాక వాస్తు దోషాన్ని కూడా కలిగిస్తాయి.

ఎండిపోయిన పూలు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉంది.దానివల్ల మనలో ఎక్కువగా నీరసం పెరుగుతుంది.

దీనివల్ల ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

If You Want To Keep All The Family Members Happy In Your House Then Do Not Grow

తాజా పువ్వులను ఎప్పుడూ ఇంట్లో ఉండేలా చూసుకోవాలి.ఇలాంటి పూలు ఇంట్లో ఉండడం వల్ల సానుకూల శక్తి పెరిగే అవకాశం ఉంది.తాజా పువ్వులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి పై ఎప్పుడు ఉంటుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

లక్ష్మీదేవి అనుగ్రహం మా ఇంటిపై ఉండడం వల్ల ఆ ఇంట్లోనీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు.వాస్తు ప్రకారం ఇంట్లో నైరుతి దిశలో పువ్వులు కానీ పూల మొక్కలను కానీ ఉంచడం అంత మంచిది కాదు.

Advertisement

పువ్వులకు ఈ దిశను శుభంగా భావించరు.ఈ దిశలో పూలనుంచడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ కారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది.

తాజా వార్తలు