కోరిన కోరికలు తీరాలంటే... ఆ గుడిలో అరటి గెలలు కట్టాలి..!

సాధారణంగా ఎవరైనా వారి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటారు.

అదేవిధంగా వారి జీవితంలో అనుకున్న పనులు నెరవేరాలంటే దేవుడికి మొక్కులు మొక్కుతారు.

సాధారణంగా దేవుడి సన్నిధిలో మనం ఏదైనా కోరికలు కోరుకొని ఆ కోరిక నెరవేరాలని ముడుపులు కట్టడం చూస్తుంటాము.కానీ కోరిన కోరికలు నెరవేరాలని ఎప్పుడైనా గుడిలో అరటి గెలలు కట్టడం చూశారా మీరు విన్నది నిజమే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో చెట్లతాండ్ర గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఏదైనా కోరికలు కోరుకుని స్వామి వారి సన్నిధిలో అరటి గెలను సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

చెట్ల తాండ్ర గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన పందిళ్లలో అరటికాయలను సమర్పించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.ఈ విధంగా ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అరటిపండ్లను దేవుని సన్నిధిలో కట్టి ప్రతి ఏటా ఒక పండుగలా జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉన్న ఆలయంలో భక్తులు పెద్దఎత్తున స్వామివారికి అరటి గెలలు సమర్పించి కోరికలు కోరుకుంటారు.

If You Want To Fulfill Your Desires You Have To Tie Banana Leaves In That Temple
Advertisement
If You Want To Fulfill Your Desires You Have To Tie Banana Leaves In That Temple

ఈ ఆలయంలో వెలసిన నరసింహ స్వామిని దర్శించుకొని పక్కనే ఉన్న రావి చెట్టు దగ్గర పందిరి వేసి ఉంటారు.భక్తులు అరటి పండ్ల గెలవడం ఆ పందిరికింద కట్టి కోరికను కోరుకుంటారు.మరికొంత మంది భక్తులు వారి కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ఈ విధంగా అరటి పండ్ల గేలను కట్టి స్వామివారి మొక్కు తీర్చు కుంటారు.

ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుని అరటిపండ్ల గెలలను దేవుడికి సమర్పిస్తుంటారు.అయితే ఈ విధంగా అరటిపండ్లను కట్టడం వెనుక ఓ ఆచారం ఉంది.

If You Want To Fulfill Your Desires You Have To Tie Banana Leaves In That Temple

పురాణాల ప్రకారం ఈ గ్రామంలో ఒక స్వామీజీ ఉండేవారు.ఈ స్వామీజీ ఆ గ్రామంలో ఉన్న వారికి ఎటువంటి వ్యాధికైనా వైద్యం చేసి నయం చేసేవాడు.ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఆ గ్రామంలోనే ఉంటూ తర్వాత మరణించారు.

ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఒక రావిచెట్టు మొదలవడంతో ఆ గ్రామస్తులు అందరూ ఆ రావిచెట్టును స్వామీజీ గా భావించి పూజలు చేసేవారు.అదే విధంగా వారు కోరిన కోరికలు రావిచెట్టు తీర్చడంతో రావిచెట్టును స్వామీజీ స్వరూపంగా భావించారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అయితే స్వామి వారు సజీవంగా ఉన్నప్పుడు కేవలం అరటి పండ్లను మాత్రమే తినేవారని భక్తులు ఈ రావిచెట్టుకు అరటిపళ్ళను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించారు.అప్పటినుంచి గ్రామంలో ఉన్న ఆలయంలో ఏవైనా కోరికలు నెరవేరాలంటే స్వామి వారి సన్నిధిలో ఉన్న రావి చెట్టుకు అరటికాయలను సమర్పించి కోరికను కోరేవారు.

Advertisement

అయితే క్షేమంగా అక్కడ స్థల ప్రభావం కారణంగా భీష్మ ఏకాదశి రోజు ఆ ప్రాంతంలో పందిళ్లను వేసి వాటి కింద అరటి గెలలను కట్టించడం ప్రారంభించారు.అదేవిధంగా మరుసటి రోజు వచ్చి అరటి గెలలను తీసుకొని వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంచి పెడతారు.

తాజా వార్తలు