సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ లో మంత్రి హరీశ్ రావు రోడ్ షో నిర్వహించారు.బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి తాగునీరు అందించామని తెలిపారు.
రూ.200 పెన్షన్ ను రూ.2 వేలు చేసిన ఘనత కేసీఆర్ దేనని మంత్రి హరీశ్ రావు అన్నారు.ఇప్పుడు రూ.2 వేల పెన్షన్ ను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.కర్ణాటకలో నాలుగు గంటలే కరెంట్ వస్తోందన్న ఆయన 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని సూచించారు.తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు.