దీపావళి పండుగకు ఈ ఆలయాలను సందర్శిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటే ఉండదు..

మనదేశంలో పండుగలను కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.

అంతేకాకుండా దీపావళి పండుగ రోజు కుటుంబ సభ్యులందరూ ఇంట్లో పూజలు కూడా చేస్తూ ఉంటారు.

అలాగే దీపావళి రోజు కుటుంబ సభ్యులందరికీ ఈ ప్రముఖ లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్లి రావడం వల్ల ఇంట్లో కి సిరి సంపదలు వస్తాయి.దీపావళి పండుగను దీపాలు వెలిగించి ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారు.

అయితే ఈ పండుగ సకల సంపదలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.పండుగ రోజున దేశంలోని చాలా ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాలకు వచ్చి లక్ష్మీ దేవిని పూజిస్తారు.

ఈ ప్రముఖ లక్ష్మీదేవి ఆలయాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ దీపావళి పండుగ నాడు ఉజ్జయినిలోని గజలక్ష్మీ మాత ఆలయాన్ని ఓ సారి సందర్శించడం మంచిది.

Advertisement

ఎందుకంటే, ఈ ఆలయంలో పాండవుల తల్లి కర్ణుడి మాత అయిన కుంతీదేవి గజలక్ష్మీ అమ్మవారికి ఇక్కడ పూజలు చేసిందని చెబుతూ ఉంటారు.ఈ గజలక్ష్మి మాతను విక్రమాదిత్యుడు కూడా ఆరాధించాట.

దీపావళి జరిగిన రెండవ రోజున ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఒడిశా రాష్ట్రంలోని జగన్నాథపురిలో కొలువైన సర్వమంగళ దేవి ఈ ప్రాంతంలో మహాలక్ష్మి రూపంలో అక్కడి ప్రజలు పూజిస్తూ ఉంటారు.

ఈ దీపావళికి మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీ ఇంట సిరిసంపదలకు కొదవ ఉండదని ఇక్కడి ప్రజల నమ్ముతూ ఉంటారు.

టెంపుల్ టౌన్ గా ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.ఈ దేవాలయాన్ని సౌత్ గోల్డెన్ టెంపుల్ అని కూడా చెబుతూ ఉంటారు.ఈ ఆలయం తమిళనాడులోని వెల్లూరు పట్టణంలోని మలైకోడి కొండపై ఉంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
శొంఠి పొడి రెగ్యుల‌ర్‌గా తింటే..ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ఇక్కడి దేవతా మూర్తి తేజోవంతమైన కాంతితో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు