బొప్పాయిని ఈ విధంగా తీసుకుంటే ఎంత లావుగా ఉన్న సన్నబడతారు!

ఏడాది పొడవునా విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో బొప్పాయి ఒకటి.మధురమైన రుచిని కలిగి ఉండే బొప్పాయి పండులో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడే వారికి బొప్పాయి ఒక వరం అని చెప్పవచ్చు.ఇప్పుడు చెప్పబోయే విధంగా బొప్పాయిని తీసుకుంటే కనుక ఎంత లావుగా ఉన్నా కొద్దిరోజుల్లోనే సన్నబ‌డతారు మరి ఇంకెందుకు ఆలస్యం బరువు తగ్గడానికి బొప్పాయిని ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న సైజు బొప్పాయి పండును తీసుకొని పై తొక్క లోపల ఉండే గింజలు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అర అంగుళం పచ్చి పసుపు కొమ్మును తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement
If You Take Papaya In This Way You Will Lose Weight Fast Details! Papaya, Weight

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న‌ బొప్పాయి పండు ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ పసుపు కొమ్ము ముక్కలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు, హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బొప్పాయి జ్యూస్ సిద్ధమవుతుంది.

If You Take Papaya In This Way You Will Lose Weight Fast Details Papaya, Weight

ఈ జ్యూస్ ను బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు సేవించాలి.ప్రతిరోజు ఈ బొప్పాయి జ్యూస్ ను తీసుకుంటే కనుక మెటబాలిజం రేటు పెరుగుతుంది.దాంతో క్యాలరీలు చాలా త్వరగా బర్న్ అవుతాయి.

ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఈ బొప్పాయి జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి.

అందువల్ల ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

అంతేకాదు ఈ బొప్పాయి జ్యూస్ ను తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది.మ‌ల‌బద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

Advertisement

జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.మరియు నీరసం, అలసట వంటివి తరచూ వేధించకుండా సైతం ఉంటాయి.

తాజా వార్తలు