మునక్కాయను రోజు ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ తో పాటు మరెన్నో అద్భుత బెనిఫిట్స్ మీ సొంతం!

మన దక్షిణ భారతదేశంలో కోట్లాది మంది మనసు దోచిన కూరగాయల్లో మునగ ఒకటి.మునక్కాయను( drumstics ) రకరకాలుగా వండుతుంటారు.

ఎలా వండినా మునక్కాయ కూర అద్భుతంగా ఉంటుందని చెప్పాలి.రుచిలోనే కాదు మునక్కాయలో పోషకాలు కూడా అపారంగా ఉంటాయి.

ముఖ్యంగా మునక్కాయను రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వెయిట్ లాస్ తో పాటు మరెన్నో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా ఒక చిన్న మునక్కాయను తీసుకుని వాటర్ తో శుభ్రంగా క‌డిగి ముక్కలుగా కట్ చేసుకోండి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోండి.వాటర్ హీట్ అవ్వగానే అందులో మునక్కాయ ముక్కలు, పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్( Pink salt ), హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి( Cumin powder ), పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరిగించాలి.

If You Take Drumstick Like This, You Can Get Many Health Benefits Drumsticks, D
Advertisement
If You Take Drumstick Like This, You Can Get Many Health Benefits! Drumsticks, D

వాటర్ ఆల్మోస్ట్ సగం అయ్యే వరకు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆపై మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) మిక్స్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఈ మునక్కాయ వాటర్ ను రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

ముఖ్యంగా ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచి వెయిట్ లాస్ కు తోడ్పడుతుంది.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

If You Take Drumstick Like This, You Can Get Many Health Benefits Drumsticks, D

అలాగే ఈ మునక్కాయ వాటర్ ను రోజు తీసుకుంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది.కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

అంతేకాదు ఈ మునక్కాయ వాటర్ తాగితే మోకాళ్ళ నొప్పులు మటుమాయం అవుతాయి.గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు సైతం ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు