పోలీస్‌కే చుక్కలు చూపించిన దున్నపోతు.. అతను ఏం చేశారో చూస్తే..??

ఉత్తర ప్రదేశ్ లోని హర్దోయి( Hardoi in Uttar Pradesh ) ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన చాలామందిని షాక్ కి గురి చేసింది.

దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.

ఇందులో పోలీసు అధికారిని దున్నపోతు వెంటాడిన దృశ్యాలు కనిపించాయి.అధికారి తన వాహనంలో వెళుతుండగా, దారిలో నిలబడి ఉన్న దున్నపోతును పక్కకు తరమాలని చూశాడు.

కానీ ఆ ప్రయత్నించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.

వాహనాల రాకపోకలుతో కూడిన రద్దీగా ఉండే రహదారిలో దున్నపోతు పోలీసుల ఉరికిస్తూ కనిపించింది.

Advertisement

వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది, చాలా మంది దానిని హాస్యంగా చూస్తున్నారు.అయితే, కొందరు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి, పోలీసు అధికారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీడియోలో పోలీసు అధికారి ఒక కర్రతో ఎద్దును భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.

కానీ, దున్నపోతు భయపడకుండా, అధికారిపై దాడి చేయడానికి సిద్ధమైంది.క్షణాల్లోనే, ఆ బుల్ అధికారిని వెంబడించడం మొదలుపెట్టింది.

అధికారి దాని నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు.చివరికి, ఒక స్తంభం దగ్గర దాక్కున్నాడు.

అయినా దున్నపోతు అతనిని వదలలేదు, స్తంభం చుట్టూ పదే పదే తిరుగుతూ, అధికారిపై దాడి చేయడానికి తెగ ట్రై చేసింది.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

ఈ పోరాటాన్ని చూసిన కొంతమంది స్థానికులు( natives ) సహాయానికి ముందుకు వచ్చారు.ఒక యువకుడు పొడవైన కర్రతో దున్నపోతును తిప్పికొట్టడానికి ప్రయత్నించాడు, కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు.దున్నపోతు తిరిగి దాడి చేసింది, ఆ యువకుడిపై బలంగా దూసుకెళ్లింది.

Advertisement

భయంతో, ఆ యువకుడు రోడ్డు వైపు పారిపోయాడు.బైక్‌పై వెళ్తున్న ముగ్గురు సభ్యులతో ఉన్న కుటుంబంతో ఢీకొన్నాడు.

చివరికి, ఎద్దు రోడ్డుపక్కన కూర్చుని శాంతించింది.

తాజా వార్తలు