నిప్పుతో గేమ్స్ ఆడితే.. రిజల్ట్ ఇలా ఉంటది..!?

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో(social media platforms) స్టంట్స్ వీడియోలు వైరల్ అవుతుండటం సర్వసాధారణం.కానీ, కొన్ని విన్యాసాలు అత్యంత ప్రమాదకరమైనవిగా మారిపోతాయి.

ఇటువంటి ప్రమాదకర స్టంట్స్ చేసే ప్రయత్నంలో ఒక యువకుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు.అందుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

వైరల్ అవుతున్న వీడియోలో.ఒక వ్యక్తి లైటర్‌ను (Lighter)నోటిలో పెట్టుకుని మరొక చేత్తో వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఈ సాహస స్టంట్ చివరికి భయానక రూపం దాల్చింది.అతను లైటర్‌ను పగలగొట్టగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Advertisement

ఈ ప్రమాదంలో అతని ముఖం కొద్దిగా కాలిపోయినట్లుగా కనపడుతుంది.మొదటగా రైటర్ ను నోట్లో పట్టుకొని మరో చేత్తో వేరొక లైటర్ తో వెలిగించడానికి ప్రయత్నం చేశాడు.

ఈ సమయంలో ఒక్కసారిగా నోటిలో ఉన్న లైటర్ను పగలగొట్టదని మరో చేతిలో ఉన్న లైటర్ నుంచి వచ్చిన మంటల ద్వారా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి(Large-scale fires broke out).దీంతో ఆ అబ్బాయి మొఖం కొద్దిమేరా కాలినట్లుగా తెలుస్తుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ ఘటనపై భిన్నంగా స్పందిస్తున్నారు.ఒకరు తన ముఖాన్ని కాల్చుకోవడానికి స్టంట్ చేసాడని కామెంట్ చేయగా, మరికొందరు నిప్పుతో(Fire) ఆడుకుంటే ఇలానే అవుతుందని కామెంట్ చేస్తున్నారు.మరికొందరు చావు అంచులదాకా వెళ్లి తిరిగి రావడం అని రాసుకొని వచ్చారు.

ఇక మరికొందరు నిప్పుతో ఆటలు ఎప్పుడూ ప్రమాదకరమే.చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకమవచ్చు అని అంటున్నారు .వైరల్ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి స్టంట్స్ చేయకుండా, భద్రతా చర్యలను పాటించాలి.ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Advertisement

తాజా వార్తలు