పూజ గదిలో ఈ నియమాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం.. జీవితంలో..!

హిందూ ధర్మంలో ప్రతి రోజు దేవుడుని పూజించాలన్న నియమా నిబంధనలు ఉన్నాయి.

భగవంతుడు నివసించని ఏ కనుమ కూడా ఈ ప్రపంచంలో ఉండదని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

భగవంతుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సానుకూలత లభిస్తాయని ప్రజలు నమ్ముతారు.దాదాపు చాలా మంది ప్రజలు తమ ఇంట్లో దేవుడిని ఆరాధించడానికి ఒక పూజ గది( Pooja-room )ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.

పూజ గదిలో ఇంట్లో సానుకూల శక్తినీ ప్రసారం చేస్తుంది.మనం పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి.

కానీ మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం.పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి.

Advertisement

ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.స్నానం చేయకుండా పూజ గదిలోకి అసలు వెళ్లకూడదు.

ఉదయం, సాయంత్రం పూజ గదిలో దీపాలు వెలిగించాలి.గంటా, శంఖము( Conch ) కచ్చితంగా మోగించాలి.

హిందూ మతంలో ఏ పూజ చేసిన సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతే ఏదైనా శుభకార్యం మొదలుపెడతారు.అందుకే పూజ మందిరంలో వినాయకుడు విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి.ఇది సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు.

వినాయకుడు కూర్చున్నట్లు ఉన్న విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పూజ గదిలో ఉంచాలి.వాడిపోయిన రోజుల, తరబడి ఉంచిన పువ్వులను పూజకు అస్సలు ఉంచకూడదు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రోజు నైట్ త్వరగా నిద్ర పట్టడం లేదా.. అయితే ఇకపై ఇలా చేయండి!

పూజ గదిలో శివలింగాన్ని ఉంచినట్లయితే శివలింగ పరిమాణం చిన్నగా ఉండేలా చూసుకోవడం మంచిది.పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు.మీ పూర్వీకుల ఫోటోలు దక్షిణ దిశలో ఉంచడం మంచిది.

Advertisement

హిందూ గ్రంధాల ప్రకారం శని దేవుడు, కాళీమాత( kali matha ) భైరవబాబా చిత్రపటాలను పొరపాటున కూడా ఇంట్లో ఉంచకూడదు.ఈ దేవుళ్ళ విగ్రహాలను ఇంట్లోనే పూజ గదిలో ఉంచినట్లయితే మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తాజా వార్తలు