పట్టణాల్లో పాములు( snakes ) కనబడడం చాలా అరుదుగా జరుగుతుంది గానీ, పల్లెల్లో ఎక్కువగా ఇళ్ల చుట్టూ పరిసరాల్లో అనేక రకాల కీటకాలు, ప్రాణులు సంచరిస్తూ ఉండడం సహజం.
వీటిలో పాములు చాలా ప్రాణాంతకమైనవి.
వీటి వల్ల అనేకమంది ప్రాణాలను పోగొట్టుకున్న పరిస్థితి ఉంటుంది.ఈ పాముల సంచారం అనేది వర్షాకాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది.
ఈ సమయంలో పుట్టల్లో ఉన్న పాములన్నీ బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి.అయితే ఈ పాముల వల్ల మనకు హాని కలగకుండా ఉండాలంటే మన ఇంటి చుట్టూ కొన్ని రకాల మొక్కలను పెంచుకోవాలి.
ఈ మొక్కలను పెంచుకోవడం వలన పాములు మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
అవును, పాములను రాకుండా చేసే మొక్కలల్లో బంతిపూల మొక్క( Marigold plant ) ప్రధానమైనది.దీనిని ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.బంతిపూల మొక్కలు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచరించవని పెద్దవాళ్ళు చెబుతూ వుంటారు.
అవును, బంతిపూల నుండి వచ్చే వాసన కారణంగా పాముల వాటి దగ్గరికి రాకుండా ఉంటాయి.అలాగే మదర్ ఇన్ లాస్ టంగ్( Mother in Loses Tongue )( స్నేక్ ప్లాంట్) అనే మొక్కను పెంచుకోవడం వల్ల కూడా పాములు దారికి రాకుండా ఉంటాయి.
అలాగే పెరట్లో నిమ్మగడ్డి ( lemon grass )( లెమన్ గ్రాస్) మొక్కను పెంచుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయని భోగట్టా.లెమన్ గ్రాస్ నుండి వచ్చే ఘాటైన వాసన వల్ల పాములు, ఇతర కీటకాలు వాటి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అంతేకాకుండా మన ఇంటి చుట్టు పెరట్లో వెల్లుల్లిని( garlic ) పెంచుకోవడం వల్ల కూడా పాములు, కీటకాలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.అదే విధంగా నేల వేము మొక్క కూడా పాములు మన ఇంటి చుట్టు పక్కలకు రాకుండా దోహదపడుతుందని అంటున్నారు.సర్ఫగంధ( పాతాళ గరిడి) మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా పాములు మన పెరట్లో తిరగకుండా ఉంటాయి.
అలాగే పింక్ అగపాంతస్ మొక్క, మాచిపత్రి మొక్కను మన ఇంటి చుట్టు వుండే విధంగా పెంచుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి.ఈవిధంగా ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల పాములు మన ఇంటి పరిసరాల్లోకి రాకుండా ఉంటాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy