తెలుగు తమిళ భాషలలో హీరోగా నటిస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి నటుడు సుమన్ ( suman ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన ఒకానొక సమయంలో తెలుగులో చిరంజీవి ( Chiranjeevi ) సినిమాలకు పోటీగా సినిమాలు చేశారు.
అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల సుమన్ సినీ కెరియర్ కు బ్రేక్ పడిందని చెప్పాలి.ఈ విధంగా సుమన్ సినిమా అవకాశాలు తగ్గడంతో అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.
ఇకపోతే సుమన్ తెలుగులో ఇలా సినిమాలలో నటించడానికి కారణం మరొక స్టార్ హీరో అని ఆయన వల్లే తాను ఇన్ని సినిమాలలో నటించగలగాను అంటూ ఒకానొక సందర్భంలో సుమన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఒకరోజు తాను సినీ నటుడు భానుచందర్ (Bhanuchander) తో కలిసి మధ్యాహ్నం లంచ్ చేస్తూ ఉండగా భానుచందర్ తన వైపు తదేకంగా చూస్తున్నారు.
దీంతో తాను ఎందుకు అలా నా వంక చూస్తున్నావని అడగడంతో నువ్వు తెలుగు సినిమాలలో కూడా హీరోగా ట్రై చెయ్యి అని తనకు సలహా ఇచ్చారు.

నేను సినిమాలలోకి రావడం ఏంటి అని ప్రశ్నించడంతో మగాళ్ళమైన మేమే నీ అందాన్ని చూసి మొహం తిప్పుకోలేకపోతున్నాము.అలాంటిది ఆడవాళ్లు నిన్ను హీరోగా స్వాగతిస్తారు.అని తనకు సలహా ఇచ్చారు.
ఇక నాకు తెలుగు అసలు ఏమాత్రం రాదు అని నేను చెప్పడంతో భాష సమస్య కాదు అదే వస్తుంది అంటూ నన్ను తెలుగు నిర్మాత అయినటువంటి తమ్మారెడ్డి భరద్వాజకు (Thammareddy Bhardwaj)పరిచయం చేశారు.

నేను తెలుగులో ఇన్ని సినిమాలు చేయగలిగాను అంటే అందుకు హీరో భానుచందర్( Bhanuchander ) కారణం అంటూ సుమన్ ఓ సందర్భంలో చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.తెలుగులో హీరోగా దాదాపు 99 సినిమాలలో నటించానని అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలలో నటించాలని సుమన్ తెలిపారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నేను ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి కారణం కేవలం భానుచందర్ అంటూ సుమన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







